2వ సారి సమంత స్పెషల్ సాంగ్.. సామ్ ను వదలని ఆ డైరెక్టర్!

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు దక్షిణాది చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నూ నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇండియాస్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. చివరిగా సమంత రూత్ ప్రభు తెలుగులో ఖుషి చిత్రంతో అలరించింది. ప్రస్తుతం మరో బిగ్ ప్రాజెక్ట్ లో నటించబోతుందంటూ ప్రచారం జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే..

సమంత స్పెషల్ సాంగ్..
టాలెంటెడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన డివోర్స్ తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం పుష్ప : ది రైజ్ లో స్పెషల్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావ అనే సాంగ్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ గా మారింది. సమంత 15 ఏళ్ల కెరీర్ లో ఇప్పటి వరకు నటించిన ఒకే ఒక్క స్పెషల్ సాంగ్ అది. ఇక తాజాగా సమంత మరోసారి స్పెషల్ సాంగ్ లో నటించబోతుందంటూ గాసిప్ క్రియేట్ అయ్యింది.

Tollywood Actress Samanth Ruth Prabhu 2nd time Special Song

2వ సారి స్పెషల్ సాంగ్ లో..
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. గతంతో పోల్చితే ప్రస్తుతం 90 శాతం స్పీడ్ తగ్గించింది. ఇక తను బాలీవుడ్ చిత్రాలు, ఇంట్రెస్టింగ్ సిరీస్ ల్లో మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ తాజాగా మాత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పెద్ది చిత్రంతో సమంత రూత్ ప్రభు మెరియబోతోందని ప్రచారం జరుగుతుంది. అది కూడా స్పెషల్ సాంగ్ లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించబోతోందని అంటున్నారు.

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పెద్ది చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుకుమార్ తన ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక శిష్యుడు బుచ్చిబాబు కూడా పెద్ది చిత్రానికి అదే ఫార్మూలాను వాడబోతున్నారని తెలుస్తోంది. అందుకోసం కథకు అనుగుణంగా సమంతతో స్పెషల్ సాంగ్ పెట్టాలని చూస్తున్నారంటూ ప్రచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మున్ముందు ఎలాంటి అప్డేట్స్ అందుతాయనేది వేచి చూడాలి.

ఇక సమంత రూత్ ప్రభు ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. డీగ్లామర్ రోల్ లో ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్ ను బయట పెట్టింది. ఆ చిత్రానికి కూడా బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక సమంత బాలీవుడ్ లో రక్త్ : భమరాంభ అనే సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. పెద్ది చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X