Sreeleela Remuneration: భారీగా రేటు పెంచేసిన శ్రీలీల.. రెమ్యునరేషన్ డిమాండ్ ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిందే మొదలు సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెండితెరపై తన డాన్స్, నటన, రూప సౌందర్యంతో కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీలా అందుకుంటున్న పారితోషికం ఎంతనేది హాట్ టాపిక్ గా మారింది.
తొలి చిత్రంతో సెన్సేషన్..
టాలీవుడ్ అగ్ర దర్శకుడు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పెళ్లి సందD చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగు పెట్టింది శ్రీలీలా. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన నటించింది. తొలి చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. దాంతో శ్రీలీలాకు తెలుగులో వరుసగా అవకాశాలు అందాయి. తనకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంది.

ఏకంగా స్టార్ హీరోలతో..
ప్రస్తుతం శ్రీలీలాకు 24 ఏళ్లు ఉంటాయి. అయితే శ్రీలీలా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 6 ఏళ్లు దాటి పోయింది. మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రంలో నటించిన తర్వాత శ్రీలీలాకు మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత స్కంద, భగవంత్ కేసరి, ఆది కేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే పుష్ప 2లో ఐటెం సాంగ్ తోనూ అలరించింది. ఇలా చిన్న వయసులోనే పెద్ద స్టార్స్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
రెమ్యూనరేషన్ డబుల్..
శ్రీలీలా రెమ్యూనరేషన్ ప్రస్తుతం భారీగా పెంచేసిందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ రవితేజ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫిలిం ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉంది. దీంతో శ్రీలీలా కూడా తన రెమ్యూనరేషన్ను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. గతంలో 3.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోసుకొని తీసుకునేది.
రాబోయే చిత్రాలు..
శ్రీలీలా చివరిగా టాలీవుడ్ స్టార్ నితిన్ సరసన రాబిన్హుడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక నెక్స్ట్ జూనియర్, మాస్ జాతర, ఆషీకీ 3, ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు రెగ్యులర్ గా హాజరవుతోంది.


Click it and Unblock the Notifications











