నిన్ను కొనుకోవచ్చా? షాక్ లో శ్రీలీలా.. చర్చగా మారిన క్యాజువల్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ ఏజ్ లోనే ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెపించింది. తన సినిమాలతో, డ్యాన్స్ తో, నటనతో, బ్యూటీ ఇప్పటికే మాసీవ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక శ్రీలీలా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ ఉంటుంది. తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా తను పంచుకున్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటీ? ఎందుకు చర్చగా మారిందనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో సెన్సేషన్ గా..
తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీలీలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన కంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకొని వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటోంది. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంతో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్ లో శ్రీలీలా సెన్సేషన్ గా మారింది. ఇక స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్ట్ర్సా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్ హుడ్, పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ తోనూ అలరించింది.

సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్..
శ్రీలీలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడమే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తన డ్యాన్స్ తో అదరగొట్టింది. అందరి చూపు తనపై పడేలా చేసింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు మహేశ్ బాబు, రవితేజ, రామ్ పోతినేని, బాలయ్యతో ప్రశంసలు అందుకుంది. దాంతో టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారడమే కాకుండా సోషల్ మీడియాలోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. శ్రీలీలాకు ఇన్ స్టా గ్రామ్ లో 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం.
శ్రీలీలా లేటెస్ట్ పోస్ట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో శ్రీలీలా ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. అటు వెండితెరపైనే కాకుండా ఇటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలనూ పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా యూఎస్ లోని ఫ్లోరిడాలో ఉన్నట్టుగా తన అభిమానులకు అప్డేట్ ఇచ్చింది. ఇదే సమయంలో సూపర్ మార్కెట్ కార్ట్ లో కూర్చొని ఉన్న ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. 'నన్ను కూడా మీ కార్ట్ లో చేర్చుకోండి' అని పేర్కొంది. దీంతో ఓ అభిమాని షాకింగ్ గా స్పందించాడు. 'మీరు అమ్మకానికి ఉన్నారా? అయితే నేను ఈ కార్ట్ లో అత్యంత విలువైనది కనుగొన్నాన'ని కామెంట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ కు సమంత రూత్ ప్రభు, రాశా తడానీ కూడా స్పందించారు. లైక్ చేసి శ్రీలీలా ఫన్నీ పోస్ట్ ను వైరల్ గా మార్చారు.
శ్రీలీలా రాబోయే చిత్రాలు..
చివరిగా శ్రీలీలా రాబిన్ హుడ్ చిత్రంతో అలరించింది. నెక్ట్స్ కన్నడ, తెలుగు బైలింగ్వుల్ ఫిల్మ్ జూనియర్ అనే చిత్రంతో కిరీటీ రెడ్డితో కలిసి అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈచిత్రం జూలై 18న విడుదల కానుంది. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు మాస్ మహారాజా రవితేజతో మాస్ జాతర, హిందీలో ఆషికీ 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











