పాపం కీర్తి సురేష్.. నమ్ముకుంటే ఆ హీరోని నిండా ముంచేశాడుగా!
సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్లి అదరగొడుతున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ ఇపుడు చాలా మందే కనిపిస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి స్కిన్ షో చెయ్యడానికి ఇష్టపడని కొందరు హీరోయిన్స్ ఇప్పుడు అందుకు కూడా వెనుకాడకుండా అన్నిటికీ సై అంటున్నారు. మరి ఇలా కెరీర్ ని హోమ్లీగా స్టార్ట్ చేసి ఇప్పుడు హాట్ గా మారిన హీరోయిన్ కోసమే చెప్పుకునేది..
నాచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ తన కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి పాత్రలు సొంతం చేసుకొని అదరగొట్టింది. అలా స్కిన్ షో లేకుండానే సినిమా అవకాశాలు అందుకోవచ్చని ఆమె ప్రూవ్ చేసింది కానీ ఇప్పుడు హాట్ షో చేస్తూ అదరగొడుతుంది. కాగా రీసెంట్ గా కీర్తి చేసిన పలు కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తమిళ్ లో తాను చేసిన లేటెస్ట్ చిత్రం "రఘు తాత" ప్రమోషన్స్ లో టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవిని కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో పోల్చడం ఇంకా తనకంటే తక్కువే చేయడం సోషల్ మీడియాలో ఆమెపై నెగిటివిటీ తీసుకొచ్చింది. కీర్తి విజయ్ ని చిరంజీవి కంటే బెటర్ గా డాన్స్ చేస్తాడు, బెటర్ గా నటిస్తాడు అని చెప్పడం షాకింగ్ గా మారింది.
మినిమమ్ సినిమాలని ఫాలో అయ్యేవారు ఎవరైనా కూడా చిరంజీవితో నటనలో కానీ డాన్స్ లో కానీ విజయ్ ఏ కోశానా సాటి రాడనే చెబుతారు. మరి ఇలా కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ తప్పని ప్రూవ్ కావడానికి ఎంతో సమయం కూడా పట్టలేదు. అంత కాన్ఫిడెంట్ గా నమ్మకంగా విజయ్ పేరుని కీర్తి చెబితే విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం నుంచి వచ్చిన స్పార్క్ సాంగ్ దారుణంగా ట్రోల్స్ కి గురవుతుంది.

ఇంకా చెప్పాలంటే అందులో పెద్ద మైనస్ విజయ్ వేసిన డాన్స్ మూమెంట్సే అని నెటిజన్స్ అంటున్నారు. దీనితో అసలు విజయ్ ఎలా చిరంజీవికి పోటీ అవుతాడు. చిరంజీవి డాన్స్ లు చూస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అని మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటే, కీర్తి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. దీనితో ఎంతో నమ్మకంగా విజయ్ పేరుని చెప్పుకొచ్చిన కీర్తి సురేష్ ని అదే విజయ్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా ముంచేశాడు అని చెప్పాలి.
ఆల్రెడీ కీర్తి సురేష్ "భోళా శంకర్" సినిమాలో చిరుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కూడా చిరు ఈ ఏజ్ లో కూడా డాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. మరి కీర్తి తన మాటలు ఏమన్నా వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. ఇప్పుడు అయితే కీర్తి తెలుగు, తమిళ్ సహా హిందీలో కూడా పలు చిత్రాలు చేస్తుండగా తన హాట్ షో అంతా తన బాలీవుడ్ డెబ్యూ కోసమే అన్నట్టుగా కూడా టాక్ ఉంది.


Click it and Unblock the Notifications











