ఆ ఒక్క డేట్ కోసం మెగాస్టార్, పవర్ స్టార్ పోటీ.. మధ్యలో ప్రభాస్ కూడా.. బిగ్ ఫైట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత మళ్ళీ సినిమాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే సమయం దగ్గరపడుతోంది. ఫస్ట్ వేవ్ కరోనా తగ్గుతోందని అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా సెకండ్ వేవ్ వల్ల రావాల్సిన సినిమాలన్నీ కూడా ఒక్కసారిగా వాయిదా పడ్డాయి. ఇక అందరి ఫోకస్ కూడా ఇప్పుడు ఒక ఫెస్టివల్ పైనే ఉంది. ముఖ్యంగా అగ్ర హీరోలు ప్రభాస్, మెగాస్టార్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆ డేట్ కు రావాలని చూస్తున్నారు.

బాక్సాఫీస్ ధైర్యం వచ్చినప్పటికీ..

బాక్సాఫీస్ ధైర్యం వచ్చినప్పటికీ..

క్రాక్ సినిమాతో హ్యాపీగా మొదలైన బాక్సాఫీస్ హడావుడి ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది. ఉప్పెన, జాతిరత్నాలు వంటి సినిమాలతో ధైర్యంగా అనిపించినప్పటికి మళ్ళీ వెంటనే సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతున్నందు వల్ల థియేటర్స్ మూత పడ్డాయి.

వరుసగా వాయిదాలు

వరుసగా వాయిదాలు

శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ సినిమాతో పాటు గోపిచంద్ - సంపత్ నంది మాస్ మూవీ సీటీమార్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఆల్ మోస్ట్ విడుదలకు రెడీగా ఉన్న నాని టక్ జగదీష్ కూడా ఆంద్రప్రదేశ్ లో టికెట్ల రేట్లకు భయపడి కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. విరాటపర్వం కూడా అదే తరహాలో క్యాన్సిల్ చేసుకుంది.

మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్..

మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్..

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన బిగ్ మల్టీస్టారర్ మూవీ ఆచార్య రిలీజ్ కోసం గత ఏడాది నుంచి ఎదురుచూసిన అభిమానులకు మళ్ళీ నిరాశ తప్పలేదు. బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ చేసుకొని రెడీగా ఉన్న సమయంలో వాయిదా వేశారు. ఇక రాధే శ్యామ్ సినిమాతో పాటు పవర్ స్టార్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ కూడా వాయిదా పడింది.

Recommended Video

Vijay Devarakonda Rejected Star Directors Deal | Liger Movie || Filmibeat Telugu
ముగ్గురు హీరోలు ఒకేసారి అంటే..?

ముగ్గురు హీరోలు ఒకేసారి అంటే..?

చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లు ఓపెన్ అవ్వగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ పెద్ద సినిమాలు మాత్రం ఇప్పట్లో రావట. మెగాస్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్ సినిమాలు ఈ దసరా సీజన్ ను టార్గెట్ చేశాయి. ఆ మూడు సినిమాల నిర్మాతలు కూడా దసరా కంటే రెండు రోజుల ముందు రోజే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ అలా చేస్తే బాక్సాఫీస్ వద్ద అందరికి నష్టమే. ఇక ఆలస్యం చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. మరి ఈ విషయంలో స్టార్ హీరోలు ఎలా ఆలోచిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X