కరోనా ఎఫెక్ట్.. సినీ పెద్దల అత్యవసర సమావేశం.. ఇదే నిర్ణయం తీసుకోబోతున్నారా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ ఇష్యూగా మారింది కరోనా ఎఫెక్ట్. చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తుండటంతో జనం వణికిపోతున్నారు. కాగా హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు బయటపడుతుండటంతో అన్నివర్గాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వివరాల్లోకి పోతే..

హైదరాబాద్ చేరిన కరోనా.. ఉద్యోగులకు ఆదేశాలు
ఇకపోతే ఇటీవలే కరోనా వైరస్ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది. అంతేకాదు ఇంకొందరిలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతుండటంతో పలు ఉద్యోగ సంస్థలు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేశాయి.

జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలు.. జాగ్రత్తలు
జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కొద్ది రోజుల పాటు జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు.

సినీ పెద్దల సమావేశం
ఈ నేపథ్యంలోనే సినీవర్గాలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని సినీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు నేటి సాయంత్రం (గురువారం) హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సమావేశం కానున్నారు.

ఈ నిర్ణయమే తీసుకోనున్నారా?
ఈ సమావేశంలో కరోనా వైరస్ గురించిన చర్చలు జరపనున్నారట. ఇందులో భాగంగా కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కరోనా కేసుల సంఖ్యను పెరిగే అంశాన్ని బట్టి, సినిమా హాల్స్ మూసివేత తదితర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
Recommended Video


థియేటర్స్ బంద్
మరోవైపు ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా చైనా దేశంలో పలు థియేటర్స్ మూతపడ్డాయి. సినిమా హాల్స్‌లో ప్రజల మధ్య వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అదే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











