నిర్మాతల రక్తం పీలుస్తున్న ప్రముఖ నటుడు.. ఆ ఫీలింగ్ రావాలంటూ షో ఆఫ్.. లక్షలలో అదనపు ఖర్చు!

టాలీవుడ్ లోనే కాదు ఏ సినిమా పరిశ్రమలో అయినా అవకాశాలు వచ్చే వరకూ దర్శక నిర్మాతలు వెంట పడుతూ ఉంటారు నటీనటులు. ఒక్కసారి అవకాశం వచ్చి క్లిక్ అయిన తర్వాత దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితులు ఇప్పుడు పెద్ద ఎత్తున అన్ని పరిశ్రమలలో వెలుగుచూస్తున్నాయి. అయితే ఆయా నటీనటుల స్టార్డం కారణంగా వారిని కచ్చితంగా సినిమాల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలా నిర్మాతలను జలగ పట్టినట్లు పట్టి పీడిస్తున్న ఒక టాలీవుడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే

 టాలెంట్ ఉన్నా

టాలెంట్ ఉన్నా

ఆయన తెలుగులో ఒక ప్రముఖ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. డైలాగ్ డెలివరీ విషయంలో ఆయన విలక్షణ శైలి ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడేలా చేసింది.. తనదైన నటనతో సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్ళ గలిగే టాలెంట్ ఆయన సొంతం.. అయితే ఎంత టాలెంట్ ఉన్నా ఆయన వ్యవహార శైలి కారణంగా ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నటనకు మించి

నటనకు మించి

ఆయన వింత, విచిత్రమైన కోరికలతో నిర్మాతల రక్తం పిలుస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.. ఆయన ఒకరోజు కాల్షీట్లు కేటాయించినందుకు నాలుగు లక్షల రూపాయలు చార్జీ చేస్తారట.. సినిమాలో ఆయనకి కొంచెం పెద్ద పాత్ర అయితే కేవలం ఆయన ఒక్కరి రెమ్యునరేషన్ కోటి రూపాయలు దాటిన పోతుందట.. నటించినందుకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే పర్వాలేదు కానీ ఈ మధ్య కాస్త నటనకు మించి ఎక్కువగా షో ఆఫ్ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాన్వాయ్లో వెళ్ళే ఫీలింగ్

కాన్వాయ్లో వెళ్ళే ఫీలింగ్

తనకు సపరేట్గా స్టాఫ్ వారి ఖర్చు కాకుండా తనకు ఇచ్చే కార్ తో సహా మరో రెండు ఇన్నోవా వాహనాలు కావాలని తన వెహికల్ ముందు ఆ కార్లు ఎస్కార్ట్ లాగా పరుగులు పెట్టాల్సిందే డిమాండ్లు పెడుతున్నాడట సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. పోనీ వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. ఏదో ఒక కాన్వాయ్లో వెళ్ళే ఫీలింగ్ కోసమే నిర్మాతలను ఇలా డిమాండ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది..

ఎక్స్ట్రా బిల్లులే

ఎక్స్ట్రా బిల్లులే

అంతేకాకుండా హీరో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఒక లగ్జరీ క్యారవాన్ కూడా తనకు ఉండాల్సిందేనని డిమాండ్ సినిమా కథ చెప్పినప్పుడే ముందు ఉంచుతున్నారట. తమ స్టాఫ్ కి ప్రత్యేక చార్జీలు, లగ్జరీ ప్రయాణాలు, అవుట్ డోర్ షూటింగ్ కి వెళితే లగ్జరీ హోటళ్ళలో బస లాంటివి అదనపు ఖర్చులు అని తెలుస్తోంది. ఆయనకు ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండా ఈ ఎక్స్ట్రా బిల్లులే లక్షల రూపాయల మేర ఖర్చు అవుతున్నాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

అర్జెంట్ పని ఉందంటూ

అర్జెంట్ పని ఉందంటూ

ఇంత ఖర్చు పెడుతున్నాం కదా ఆయన కాల్ షీట్స్ పూర్తిగా వాడుకోవాలని దర్శకనిర్మాత భావిస్తే అది కూడా వారికి ఎదురు దెబ్బ గానే మారుతుంది ఎందుకంటే ఆయన సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత నటించడానికి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదట. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అర్జెంట్ పని ఉందంటూ ఎక్కడినుంచో ఆయనకు ఫోన్ వస్తుందట. ఇంకేముంది అప్పటి నుంచి వెళ్ళాలి, వెళ్ళాలి అంటూ 5 గంటల లోపు ఆ లొకేషన్ నుంచి ఆయన జంప్ అయిపోతున్నారని తెలుస్తోంది.

అవకాశాలు తగ్గాయని

అవకాశాలు తగ్గాయని

ఇలా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న కారణంగానే ఈ మధ్య కాలంలో ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ఆయనను, ఆయన ఖర్చులను తట్టుకోలేక ఆయనకు కాస్త దూరంగా ఉంచుతున్నారట దర్శకనిర్మాతలు. ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకుని ఆయన మాములుగా ప్రవర్తిస్తే ఇకమీదట నాలుగు కాలాలు పాటు మంచి పాత్రలు చేసే అవకాశం లభిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X