YS Jagan ఏపీ సీఎంతో ప్రముఖ నటుడు ఆలీ భేటి!.. కీలక పదవి రేసులో టాప్ కమెడియన్

తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలను చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెళ్లిన ప్రముఖుల్లో ప్రముఖ హాస్య నటుడు ఆలీ కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకు ముందు రోజు వరకు కూడా ఆలీ పేరు వినిపించకపోవడంతో ఈ బృందంలో ఆయన ఉంటారని ఎవరూ ఊహించలేదు. అయితే చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి లాంటి ప్రముఖులతో ఆలీ కనిపించడం సినీ, రాజకీయ వర్గాలకు షాక్ తగిలినంత పనైంది.

అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌తో ఆలీ భేటి కూడా జరుగబోతున్నదనే విషయం మీడియాలో ప్రచారం జరిగింది. తాజా వార్తల ప్రకారం. ఫిబ్రవరి 15న అంటే మంగళవారం ఏపీ సీఎంను కలిసేందుకు ఆలీ వెళ్లారనే వార్త వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

రాజకీయ పార్టీలతో అనుబంధం

రాజకీయ పార్టీలతో అనుబంధం

టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ ఆలీ సినిమా కెరీర్‌ను కొనసాగిస్తూనే, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. అలాగే రాజకీయాల్లో తన సేవలు అవసరమైనప్పుడల్లా ప్రచారం చేస్తూ కనిపించారు. దశాబ్దకాలంగా పరోక్షంగా రాజకీయాల్లో కొనసాగుతూ తెలుగుదేశం, జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో కొనసాగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీకి విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.

ఆలీకి అత్యంత ప్రాధాన్యత

ఆలీకి అత్యంత ప్రాధాన్యత

తన మిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో రాజకీయంగా విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఆలీకి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదనే విషయం తాజా సినీ ప్రముఖుల భేటి స్పష్టం చేసింది. సినీ ప్రముఖులు బృందంలో వ్యూహాత్మకంగా ఆలీని చేర్చడం వెనుక సినీ పరిశ్రమకు ఆలీ తమకు ఎంత ఆప్తుడనే విషయాన్ని ప్రత్యక్షంగా సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో ఆలీకి కీలక పదవిని ఇస్తారనే ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

ఫిబ్రవరి 15న సీఎంతో ఆలీ భేటి

ఫిబ్రవరి 15న సీఎంతో ఆలీ భేటి

తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంగళవారం అంటే ఫిబ్రవరి 15 తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటికి ఆలీ విజయవాడకు వెళ్లారు. పార్టీకి సేవలందిస్తున్న నేపథ్యంలో తగిన గుర్తింపు ఇవ్వడానికి ఏపీ సీఎం సానుకూలంగా ఉన్నారు. అందుకే వైఎస్ జగన్‌తో సమావేశం కావడానికి ఆలీ సిద్దమయ్యారు. సీఎంతో భేటీ తర్వాత ఆలీకి ఇచ్చే గౌరవం, పదవిపై క్లారిటి వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

అలీకి కీలక పదవిపై ఊహాగానాలు

అలీకి కీలక పదవిపై ఊహాగానాలు

అయితే సినీ, రాజకీయ వర్గాల ఊహాగానాల ప్రకారం.. ఆలీని రాజ్యసభకు పంపిస్తారని, లేదా ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి పదవులకు ఆలీని నామినేట్ చేసే అవకాశాలు తక్కువ. ప్రస్తుతం పరిస్థితుల్లో, ఏపీ సీఎంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి భారీ పదవులు ఆలీకి దక్కే అవకాశం ఉండకపోవచ్చనే వాదనను రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వంలో అలీకి సముచిత గౌరవం

ఏపీ ప్రభుత్వంలో అలీకి సముచిత గౌరవం

కానీ, ఆలీకి ఏపీ ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని ఇచ్చేందకు సిద్ధంగా ఉంది. టాలీవుడ్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన కమిటీలలో ఆలీ హోదాకు తగినట్టు ఓ కీలక పదవిని ఇచ్చే అవకాశం ఉందనే విషయం తెలిసింది. అయితే ఒకవేళ జగన్‌తో ఆలీ భేటి నేడు జరిగినట్టయితే.. త్వరలోనే ఆ వివరాలు, ఆలీ చేపట్టబోయే పదవికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X