Prabhas సలార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు కమెడియన్.. ఎలాంటి రోల్ అంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెడుతూ అభిమానుల్లో అంచనాలు స్థాయిని అంతకంతకూ పెంచుతూనే ఉన్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి సినిమా తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేక పోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి.
ఇక నెక్స్ట్ సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరికేక్కుతున్న సలార్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అందరి ఫోకస్ ఎక్కువగా ఈ సినిమా పైనే ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు అనేది అందరిలో ఒక ఆసక్తిని కలిగిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఒక మంచి పాత్ర కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా సప్తగిరి ఎలాంటి సినిమాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. హీరోగా కూడా అతను వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 30 రోజుల కాల్షీట్స్ అంటే తప్పకుండా సప్తగిరి ఫుల్ లెంత్ పాత్రలోనే ఉండవచ్చు అని అనిపిస్తుంది. కామెడితో పాటు కాస్త సీరియస్ గా ఉండే విధంగా సప్తగిరి పాత్ర అలరించబోతున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చి వరకు ఆగాల్సిందే. ఇక సలార్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు వచ్చేసింది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











