సునీల్ ని చూసి కుళ్ళుకుంటున్నారు..!
మనం ఎంత దిగజారిపోయినా ఫర్లేదు కాని పక్కనోడు ఎదిగితే అస్సలు తట్టుకోలేని రకాలు సినీ పరిశ్రమలోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈగోలతో రగిలిపోయే ఇండస్ట్రీలో తమ స్థాయి వాడు ఇంకాస్త ఎత్తుకి చేరుకుంటే అస్సలు భరించలేరు. ఇన్నాళ్లూ కమెడియన్ గా ఉన్న సునీల్ ఇప్పుడు హీరోగా మాత్రమే చేస్తూ ఉండడట అతని సాటి కమెడియన్లని విపరీతంగా వేధిస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన సునీల్ టాపిక్కే..పరోక్షంగా అతనిపై బురద జల్లుతున్నారట.
వేణుమాధవ్, అలీలాంటి వాళ్లు..అతడి ఉన్నతిని ఓర్వలేకపోతున్నారు. పెద్దపెద్ద దర్శకులు కూడా సునీల్ ని హీరో మెటీరియల్ లానే చూస్తూ ఉండడం వారిని ఇబ్బంది పెడుతోంది. అందుకే ఇప్పుడు ఏ ఇద్దరు కమెడియన్లు కలిసినా కానీ సునీల్ మేటరే వినిపిస్తోంది. 'వాడికంటే నాకేం తక్కువ?" అనే చర్చే జరగుతోంది. సునీల్ వరుసగా రెండు హిట్లిచ్చి స్టార్ అనిపించేసుకుంటే వీళ్లంతా ఏమైపోతారో మరి...


Click it and Unblock the Notifications











