టాలీవుడ్ ఫెస్టివల్ ఫైట్.. బాలయ్యతో పోటీగా మరో ముగ్గురు?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ మధ్య సరైన పోటీనీ చూసి చాలా కాలం అవుతుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి అసలైన పోటీ ఉంటుందని ప్రస్తుతం ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ అంతకంటే ముందే దసరా సమయంలో అన్నీ అనుకూలిస్తే మళ్లీ బాక్సాఫీస్ పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఆ ఒక్కరోజే కొన్ని మీడియా బడ్జెట్ సినిమాలతో పాటు ఒక భారీ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఆ సమయంలో రెండు లేదా మూడు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి ఉగాది దసరా సమయాల్లో బాక్సాఫీస్ మధ్య పోరు మామూలుగా ఉండదు.
ప్రస్తుతం అందరి చూపు కూడా దసరా వైపు ఎక్కువగా ఉంది. అసలైతే ఆ సమయానికి RRR, లేదా రాధేశ్యామ్, ఆచార్య వంటి సినిమాలు రావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్స్ లో సినిమాలు విడుదల చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని ఆ చిత్ర నిర్మాతలు సినిమాలను వాయిదా వేసుకోక తప్పలేదు. మొన్నటి వరకు ఆచార్య వంటి సినిమాలు తప్పకుండా వస్తాయని నమ్మకంతో ఉన్నారు కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఆ ఛాన్స్ ను మరికొన్ని చిన్న సినిమాలతో పాటు బాలకృష్ణ కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా అఖండపై ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.

ఇక అంతకంటే ముందు అక్టోబర్ 8 వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కొండపొలం సినిమా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ డేట్ కూడా వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అక్కినేని యువ హీరో అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అదే రోజు విడుదల కాబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి హైప్ ఐతే క్రియేట్ అవ్వలేదు. ఇక తర్వాతి వారం దసరా పండుగ రోజున శర్వానంద్-సిద్దార్థ్‌ల 'మహాసముద్రం' విడుదల కానుంది. అక్టోబరు 13న బాలకృష్ణ తో పోటీ పడేందుకు ఈ ఇద్దరు హీరోలు కూడా సిద్ధమవుతున్నారు.
ఒక విధంగా ఈ సినిమాలు చాలా ధైర్యం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నాని, వెంకీ లాంటి హీరోల సినిమాలు కూడా థియేట్రికల్ బిజినెస్ భయంతో ఓటీటీలోకి వెళ్ళి పోతున్నాయి. కానీ బాలకృష్ణ, అఖిల్, వైష్ణవి తేజ్, శర్వానంద్ వంటి వారు ఎలాగైనా థియేటర్లోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు. ఈ నాలుగు సినిమాలకు కూడా ఇదివరకే ఓటీటీల నుంచి భారీ స్థాయిలో ఆఫర్స్ అయితే వచ్చాయి. కానీ దర్శక నిర్మాతలు హీరోలు ఎవరు కూడా అటువైపు ఎంత లాభం వచ్చినా కూడా వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యారు. ఇక ఆ పోటీలో ఏ సినిమా ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











