సునీల్ హీరోగా వంశీ కొత్త చిత్రం డిటేల్స్
వంశీ దర్శకత్వంలో సునీల్ త్వరలో 'బారిస్టర్ పార్వతీసం' అనే చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. గతంలో ఇదే టైటిల్ తో 1940లో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం వచ్చింది. దానిలో ఎల్.వి.ప్రసాద్ హీరోగా చేసారు. మొక్కుపాటి నరసింహ శాస్త్రి గారి రచన 'బారిస్టర్ పార్వతీసం' కిది సినిమా రూపం. పూర్తి స్ధాయి కామిడీతో వచ్చిన ఈ నవల స్వాతంత్రం పూర్వం(1924) నాటిది. పశ్చిమ గోదావరి మొగల్తూరు నుంచి బారిస్టర్ చదువాదమని లండన్ బయిలు దేరి వెళ్ళిన ఓ అమాయికుడైన పార్వతీసం అనే కుర్రాడి కథ ఇది.ఎప్పుడూ ఊరు దాటని పార్వతీసం లండన్ వెళ్ళే దారిలో ప్రతీది ఎట్లా ఫీలవుతూండాటో అన్న దిశగా కథనం నడుస్తూంటుంది. అలాగే ఈ నవల కొంతకాలంగా పదవ తరగతి పిల్లలకు నాన్ డిటేల్ గా ఉండి అలరిస్తోంది.
ఈ నవలను దాసరి నారాయణ రావు గారు ఆ మధ్యన సినిమా చేద్దామని ప్రయత్నించి రైట్స్ సమస్య వచ్చి ఆగారు. ఇక వంశీ ఈ చిత్రాన్ని తన దైన కామిడీతో తెరకెక్కించాలని స్క్రిప్టు తయారు చేస్తున్నారు. టైటిల్ అయిన బారిస్టర్ పార్వతీశంకు ట్యాగ్ లైన్ గా ఇండియా టు అమెరికా వయా కొలంబో అని పెట్టనున్నట్లు తెలుస్తోంది. కామిడీ చిత్రాలుకు గతంలో మాటలు అందించిన ఇసుకపల్లి మోహన్ రావు చేత డైలాగులు రాయిస్తున్నారు. చక్రి చేత ట్యూన్స్ రెడీ చేయిస్తున్నారు. ఇక సునీల్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రానున్న మర్యాద రామన్నలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











