నాగబాబు ఇచ్చిన షాక్-మెగాఫ్యామిలీతో సినిమా అంటే దర్శకులకు వణుకు
మెగాస్టార్ తమ్ముడు నాగబాబు పెట్టిన మిరపకాయ ఘాటు ఇండస్ట్రీ మొత్తానికి అంటుకుంది. దర్శకుడంటే వర్మే అంటూ దండిగా ఉదాహరణలు వెళ్ళగక్కిన నాగబాబు అదే ఫంక్షన్ కు హాజరైన గ్రేట్ డైరెక్టర్ అయిన రాజమౌళి, వినాయక్ లాంటి వాళ్లను కూడా ఏకి పారేశాడు. అదృష్టం కొద్ది రాజమౌళి సినిమా ఏదీ దగ్గరలో రిలీజుకు లేదు గానీ, వినాయక్ మాత్రం నాగబాబు చెప్పిన ఆ పేరులేని వైరస్ వల్ల 'మెగా జ్వరం" పట్టుకుని వణికిపోతున్నాడు. లవ్ స్టోరీ అంటూ భాస్కర్ తీసిన 'ఆరంజ్"కే ఇన్ని అవమానాలు ఎదురైతే రేపు రాబోతున్నఅల్లుఅర్జున్ సినిమా 'బద్రీనాథ్" కనుక ఏమైన తేడాలొస్తే వినాయక్ పరిస్థితి ఏంటి?అల్లు అరవింద్ ఊరుకుంటాడా? లేక నాగబాబు లా విజృంబిస్తాడా? తమ జీవితాలతోనే ఆడుకోడూ..
ఇదే విషయమై నాగాబాబు పంచ్ స్పీచ్ ఇచ్చిన వేదిక మీదనే, ఆయన ఎదురుగానే వినాయక్ వీక్ అయిపోయాడన్నది అందరికీ తెలిసిన నిజమే. వద్దంటే పెరిగిపోయిన పనిదినాలు మరియు బడ్జెట్, కావలంటే జరిగిపోయిన బన్ని, స్నేహారెడ్డిల ఎంగేజ్ మెంట్ మరియు బన్నీ, చరణ్ ల థాయ్ లాండ్ జాయ్ ట్రిప్పు..ఇలా 'బద్రీనాథ్" మొత్తం ఎంత లాగితే అంత అన్నట్టు సాగుతుండటంతో వినాయక్ బాబుకి రాత్రి, పగలు అంటూ తేడా లేకుండా తన రాబోయే చిత్రం గురించి తెగ ఆలోచనలో పడ్డట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











