twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకుల తరువాత.. కొత్త అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయిన నాగచైతన్య.. అక్కడ ఒంటరిగానే..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల నాగచైతన్య సమంత విడాకుల విషయం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్ కపుల్స్ గా ఎంతోమంది సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుకున్నటువంటి ఈ జంట సడన్ గా విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా నేషనల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అయ్యాయి. సమంత నాగచైతన్య ఇద్దరు కూడా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సంతోషంగానే విడిపోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. విడాకుకు అనంతరం నాగచైతన్య ఆ ఇంటిని వదిలేసినట్లు సమాచారం.

    కొన్నాళ్లపాటు ప్రైవసీ లైఫ్..

    కొన్నాళ్లపాటు ప్రైవసీ లైఫ్..

    సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య తనకు ఇష్టమైన ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడని తెలుస్తోంది. నాగ చైతన్య తో తెగదెంపులు తెచ్చుకున్న తర్వాత సమంత ఎక్కువగా చెన్నై ముంబై నగరాల్లోనే ఉంటోంది. చైతన్య కూడా ఎక్కువగా హోటల్స్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కూడా కొన్నాళ్ళపాటు ప్రైవసీ గానే ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు సమాచారం. ఇక నాగార్జున కూడా వారి నిర్ణయాలను గౌరవించే విడాకులకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా నాగ్ ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు.

    వాటికి దూరంగా ఉంటున్న నాగ చైతన్య

    వాటికి దూరంగా ఉంటున్న నాగ చైతన్య

    అక్కినేని సమంత కూడా ఈ విషయంపై చాలా కూల్ గానే స్పందించింది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అనేక రకాల రూమర్స్ పై కూడా ఆమె వివరణ ఇచ్చారు. ఇక నాగచైతన్య మాత్రం మీడియాలో ఎన్ని కథనాలు వస్తున్నా కూడా ఏమాత్రం స్పందించడం లేదు. సమంత అప్పుడప్పుడు ఏదో ఒక ఫోటో తో కొటేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ చైతు మాత్రం పూర్తిగా సోషల్ మీడియాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా నాగచైతన్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. ఇక ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చూస్తున్నాడు.

    మురళీమోహన్ కట్టుకున్న బంగ్లాలో..

    మురళీమోహన్ కట్టుకున్న బంగ్లాలో..


    పెళ్లి జరిగిన తర్వాత నాగచైతన్య ఎంతో ఇష్టంగా ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. మురళీమోహన్ కట్టుకున్న ఒక బంగ్లా లోనే ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ ను సొంతం చేసుకున్నాడు. అసలైతే మొదట మురళీమోహన్ ఆ ఇంటినీ అమ్మడానికి కట్ట లేదు అని కుటుంబ సభ్యులు అందరం ఒకటే దగ్గర ఉండాలని ఆలోచనతో కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ నాగచైతన్య ఎంతగానో ఆశపడ్డాడు. ఇక నాగార్జున కూడా ప్రత్యేకంగా మాట్లాడడంతో మురళీమోహన్ కాదనలేక తన కొడుకు కోసం కట్టించిన ఒక ఫ్లోర్ నాగచైతన్యకు అమ్మేశారు.

    వచ్చే ఎడాది మరొక కొత్త ఇంట్లోకి..

    వచ్చే ఎడాది మరొక కొత్త ఇంట్లోకి..


    నాగ చైతన్య ప్రస్తుతం ఆ ఇంట్లో లేడని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ లోని ఖరీదైన ఫ్లాట్ నీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులపాటు ప్రైవసీ గా ఉండేందుకు నాగ చైతన్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జూబ్లీహిల్స్ లో నాగచైతన్య ఒక ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశాడు. అలాగే కొని పెట్టుకున్న నాగ చైతన్య తర్వాత ఎప్పుడైనా మళ్లీ దాన్ని పునర్నిర్మించాలని అనుకున్నాడు. ఇప్పుడు కొత్త ఫ్లాట్ లోకి రావడంతో ఆ ఇంటి పనులు మరమ్మతులను మళ్లీ మొదలుపెట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆ కొత్త ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Tollywood Hero Naga chaitanya buys new apartment flat ,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X