వెంకటేష్‌తో క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాతగా మారిన యువ హీరో!

టాలీవుడ్ లో చాలా మంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. వారి సినిమాలను ఎక్కువగా వారి బ్యానర్ లోనే నిర్మించుకోవాలని భావిస్తారు. అలా సొంత బ్యానర్ ఉన్న యంగ్ హీరో.. ఓ కథ తెగ నచ్చడంతో ఓ టాలీవుడ్ టాప్ హీరోను పెట్టి, తన సొంత బ్యానర్ పై సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారట. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? హీరోగా నటించబోయే స్టార్ హీరో ఎవరో ఓ లూక్కేయండి.

ఆ యంగ్ ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin). హీరో నితిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ యంగ్ హీరో కూడా సొంత బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ బాధ్యతలను ఎక్కువ తన తండ్రే చూసుకుంటారు. అయితే.. ఒకవైపు సినిమాలను చేస్తూనే మరోవైపు నిర్మాతగా అవతారం ఎత్తేత్తాలని నితీన్ భావిస్తున్నారట.

Tollywood hero Nitin is going to produce Victory Venkatesh-director TN Santosh combo movie

ఈ క్రమంలో తన తొలి సినిమాను ఏకంగా ఓ స్టార్ హీరోతోనే తీయాలని, ఆ సినిమాకు నిర్మాత బాధత్యలు పూర్తి స్థాయిలో చేపట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ సినిమా ఏంటి ? ఆ స్టార్ హీరో ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తమిళ్ డైరెక్టర్ సంతోష్ త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నరట. ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్ ను డైరెక్టర్ చెప్పిన స్టైల్ కు నితీన్ ఓకే చెప్పారంట. ఈ కథ హీరో నితీన్ కు తెగ నచ్చడంతో ఈ సినిమాను తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌ పై ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారట హీరో నితీన్.

అయితే.. ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పోలీసుగా టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్ ను మూవీ మేకర్స్ మీట్ అయ్యారంట. అయితే.. ఆయన ఈ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కానీ, ఈ మూవీ చేయడానికి వెంకీ మామా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. టాప్ హీరో ఓకే చెప్పిన తరువాత ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. వెంకీ ఇప్పటికే రెండు సినిమాలను చేస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరో వైపు.. హీరో నితిన్ మూడు సినిమాలను అనౌన్స్ చేసాడు. ఆ సినిమాలను త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇందులో రాబిన్ హుడ్ సినిమాపై నితీన్ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది . ఈ మూవీ డిసెంబర్ 20 న విడుదల కాబోతుంది. మరీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ సినిమా హిట్ పైనే మిగిలిన సినిమాలు ఫలితాలు ఆధారపడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X