అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో తెలుగు హీరో

By Srikanya

మొదటి సినిమా లీడర్ రిలీజ్ కాకముందే రాణా పూర్తి స్ధాయి బిజీ అవుతున్నాడు. అతను ప్రస్తుతం బ్లఫ్ మాస్టర్ చిత్రం దర్శకుడు రోహిన్ సిప్పీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. గోవాలోని డ్రగ్ రాకెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ట్రాఫిక్ నుంచి ప్రేరణ పొంది కథ తయారు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రాణా సెకెండ్ హీరో. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇక రాణా కమిటయిన పాత్రకోసం ఫర్హాన్ అక్తర్, ఇమ్రాన్ హష్మీ లను అడిగారు. అయితే వారెవరూ ఈ పాత్రను చేయటానికి ముందుకు రాకపోవటంతో రాణాను కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ చిత్రంలో రాణా గోవాలో ఉండే సంగీత కళాకారుడు పాత్రను పోషించనున్నారు. లీడర్ లో రాణా స్టిల్స్ చూసిన రోషన్ సిప్పీ వెంటనే ముంబై పిలిపించి ఈ చిత్రానికి ఒప్పించారు. ఈ చిత్రానికి సంభందించి ఫార్మాలిటీస్ అన్నీ క్రితం వారం పూర్తయ్యాయి. ఇక ఈ విషయాన్ని దర్శకుడు రోహిన్ సిప్పీ కరెక్టే మా చిత్రంలో రాణా చేస్తున్నారంటూ కన్ఫర్మ్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X