డార్లింగ్ రూట్లో మెగా హీరో... గ్యాప్ ఇచ్చి దాడిచేస్తానంటోన్న చరణ్
డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఏకంగా రెండేళ్లు అజ్ఞాతవాసమే చేశాడు. తన లుక్స్ ను రివీల్ చేయకుండా, కొత్త సినిమాల జోలికి పోకుండా, ఓ పెద్ద యజ్ఞమే చేశాడు. అయితే ఇప్పుడు దాని ఫలితాన్ని రుచిచూస్తున్నాడు. వరసగా భారీ ప్రాజెక్ట్ లను కైవసం చేసుకుంటున్నాడు. ప్రభాస్ సినిమాలు సుమారు వెయ్యికోట్ల బిజినెస్ చేస్తున్నాయి అంటే, ప్రస్తుతం మనోడి రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు డార్లింగ్ మంత్రాన్ని పటించేందుకు ఇతర హీరోలు కూడా సిద్ధమైపోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా RRR కోసం గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల కాస్త గ్యాప్ వచ్చినా, క్యారెక్టర్ నుంచి ఏమాత్రం డీవియేట్ అవ్వడం ఇష్టం లేక కొత్త కథలను కూడా వినడం మానేసిన చెర్రీ, ఈ గ్యాప్ లో నాన్న సినిమా ఆచార్య మినహా మరే ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పలేదు.

RRRలో తన పాత్ర పైనే దృష్టినిలిపిన చరణ్ 2021 సాతం ఈ రెండు ప్రాజెక్ట్ లకే కేటాయించేశాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలూ పూర్తైన తరువాతే కొత్త కథలు వినాలన్నది అబ్బాయి ఆలోచనట. అందుకే తన వద్దకు వచ్చిన కథలను వచ్చినట్లు రిజెక్ట్ చేసేస్తున్నాడు ఈ మెగా హీరో.
మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఇదే బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. అబ్బాయి రెడ్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. అయితే ఈ గ్యాప్ లో రామ్ సుమారు డజను కథలను రిజెక్ట్ చేసేశాడట. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి అన్న చందాన్న తన ఇమేజ్ కు తగ్గట్లు సాలిడ్ స్క్రిప్ట్ దొరకబుచ్చుకునేంత వరకూ కాస్త ఓపిక పట్టాలని ఫిక్స్ అయ్యాడట. మరి ఈ కుర్రహీరోలు విధించుకున్న ఈ స్వీయ నిర్భంధం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











