పెళ్లికి గ్రీన్ ఇచ్చిన లవర్ బాయ్ తరుణ్.. ఆ అమ్మాయి ఎవరంటే?

కొన్నేళ్ల క్రితం లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోల్లో తరుణ్ ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడే ప్రేక్షకులకు బాగా దగ్గరైన తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సీనియర్ హీరో త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వైరల్ అవుతున్నాయి.

పాతికేళ్ల వయసులోనే..

పాతికేళ్ల వయసులోనే..

నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైన తరుణ్ పాతికేళ్ల వయసులోనే బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, శశిరేఖ పరిణయం వంటి సినిమాలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. హిట్స్ ఉన్నంత కాలం తరుణ్ టాలీవుడ్ లో చాలా బిజీగా కనిపించాడు.

కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల

కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల

అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ లవర్ బాయ్ కెరీర్ పై తీవ్ర ప్రభావం పడింది. వరుస అపజయాలు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాయి. ఎన్ని ప్రయోగాలు చేసినా లాభం లేకపోవడంతో సినిమాలను పక్కనపెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టాడు. హీరోగా ఉన్నప్పుడే కొన్ని ఆస్తులను కూడబెట్టుకున్న తరుణ్ భవిష్యత్తు కోసం మాత్రం చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడు.

ఆ అమ్మాయితోనే పెళ్లి..?

ఆ అమ్మాయితోనే పెళ్లి..?

ఇక ఫైనల్ గా ఈ 37ఏళ్ల సీనియర్ యాక్టర్ పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు తరుణ్ పెళ్లికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం తన దగ్గరి కుటుంబ సభ్యుల బంధువు వారి అమ్మాయినే ఈ హీరో పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ కూడా గత నాలుగేళ్లుగా ఆమెనే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడట. యాక్టర్ గా మళ్ళీ కుదురుకున్న తరువాతే పెళ్లి చేసుకోవాలని తన ప్రేయసిని ఒప్పించినట్లు టాక్ వస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4: Noel sean Demands Sorry From Bigg Boss
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణ్

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణ్

ఇక మొత్తానికి టాలీవుడ్ లో సీనియర్ బ్యాచిలర్ బాయ్స్ ఒక్కొక్కరు లైఫ్ పాట్నర్స్ ని సెట్ చేసుకోవడంతో తరుణ్ కూడా ఫ్యామిలి సబ్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్ సిద్దార్థ్.. లాక్ డౌన్ లో హ్యాపీగా సింపుల్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చని తరుణ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X