ఆ మాస్ సినమా రీమేక్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు పోటిపడుతున్నారా...
తమిళంలో సంక్రాంతి విడుదలైన 'ఆడుకలాం" చిత్రం అద్భుతమని చూసిన వారందరితో కితాబులు అందుకుంటోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో పడ్డప్పటి నుంచి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కోడిపందాల నేపథ్యంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు హీరోల దృష్టిని కూడా ఆకర్షించింది. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కనికట్టు చేసిన ఈ చిత్రాన్ని తెలుగులో చేస్తే మాస్ ని ఆకట్టుకోవచ్చని అందరికీ అనిపిస్తోంది. అందకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి పలువురు యువ హీరోలు అప్పుడే మంతనాలు మొదలు పెట్టారు.
ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన కొన్ని పెద్ద తలకాయలు పోటీలు పడుతూ ఉండడంతో తమిళ నిర్మాత రైట్స్ రేట్ బాగా పెంచేశాడు. ఎలాగైనా ఈ సినిమా రైట్స్ దక్కించుకోవాలని ప్రొడ్యూసర్ ఫాదర్స్ ని హీరో కొడుకులు సతాయిస్తున్నారు. ఇక నిర్మాతలు ఇంట్లో లేని హీరోలు కూడా తమ హోమ్ బ్యానర్ల లా ఫీలయ్యే నిర్మాతలని పిలిపించి మరీ 'ఆడుకలాం" రైట్స్ తెస్తే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటామంటూ ఆఫర్లిస్తున్నారు. ఇంతమంది పోటీలు పడుతున్న ఈ సినిమా చివరకు ఎవరి చేతికి వెళుతుందో ఈ కోడిపందాల్లో విజేతగా నిలిచేదెవరో...?


Click it and Unblock the Notifications











