Anushka : సెన్సేషన్.. ఆ ప్రముఖ వ్యక్తితో కలిసి హోటల్లో అనుష్క - వీడియో వైరల్
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ అరుంధతిగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న ఈమె 'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా, అనుష్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. ఆమె ఓ హోటల్ రూమ్‌లో మాస్క్ వేసుకుని కెమెరా కంటికి చిక్కింది. ఆమెతో ఓ పాటు ఓ సినీ ఇంస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కూడా అక్కడే ఉండడంతో పలు అనుమానాలకు దారీ తీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కథనంలోకి వెళ్దాం..
స్టార్ హీరోయిన్ అనుష్క మొదట్లో కాస్త అందాలను గట్టిగానే చూపించినా ఆ తర్వాత 'జేజమ్మ', 'రుద్రమదేవి', 'దేవసేన', 'భాగమతి' అంటూ పవర్ ఫుల్ లేడీ హీరోయిన్గా మారిపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో లేడి ఓరియెంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయింది. ఆమె పేరు వినగానే తన అందమైన రూపం టక్కున మదిలో మదిలేలా నటనతో ప్రేక్షకుల్ని మాయ చేసింది.

అయితే అనుష్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో కనపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె పెళ్లి, రిలేషన్ షిప్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అలాగే అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించిందని అంటూ కూడా ఫొటోస్ వీడియోస్ వస్తుంటాయి. కానీ ఆ సమయంలో ఆమె సింగిల్‌గానే కనిపించేది. అయితే ఈ సారి కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.

మాస్క్ వేసుకుని ఓ హోటల్లో కనిపించింది అనుష్క. స్పీడ్‌గా హడావిడిగా నడుచుకుంటూ వెళ్లిపోతూ కనిపించింది. వైట్ డ్రెస్‌లో డెనిమ్ జాకెట్ ధరించి ఉంది. ఆమెతో పాటు యూవీ క్రియేషన్స్‌కు చెందిన ప్రమోద్ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోనే వైరల్‌గా మారింది. ఇది చూసిన వారు రకరకాలుగా తమకు నచ్చినట్టుగా తెగ కామెంట్లు చేస్తున్నారు. అనుష్క మళ్లీ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మరో సినిమా చేస్తుందేమోనని అనుకుంటున్నారు. ప్రభాస్‌పై ప్రేమతోనే అనుష్క యూవీ క్రియేషన్స్‌లో సినిమా చేస్తుందని చర్చించుకుంటున్నారు.

ఇకపోతే రీసెంట్గా ఆమె పెళ్లి వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె ఓ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోబోతుందని ఈ మధ్య బాగా ప్రచారం సాగింది. కాగా, అనుశ్క చాలా కాలం తర్వాత రీసెంట్గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించారు. మహేష్ బాబు పచ్చి గొల్ల దర్శకత్వం వహించారు. దీన్ని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానరే నిర్మించింది. మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











