భారీగా రేట్లు తగ్గించేసిన హీరోయిన్.. అసలుకే మోసం రావడంతో కీలక నిర్ణయం!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏటా పదుల సంఖ్యలో కొత్త హీరో, హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయినా సరే లక్కు ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే ఇక్కడ హీరోహీరోయిన్లుగా లేదా నటులుగా నిలదొక్కుకునే అవకాశం దొరుకుతుంది. కానీ చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఒక హీరోయిన్ మాత్రం ఇప్పుడు సరైన అవకాశాలు లేక తన రేట్లు భారీగా తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరా హీరోయిన్ ఏమిటా కథ? తెలుసుకుందామా

ఇల్లు చక్కబెట్టుకోవాలి అని

ఇల్లు చక్కబెట్టుకోవాలి అని

వేరే రాష్ట్రానికి చెందిన సదరు హీరోయిన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఒక సూపర్ హిట్ అందుకుంది. అయితే మొదట్లో ఒకటి రెండు సినిమాలు బాగానే ఆడాయి కానీ ఆ తర్వాత కథల ఎంపికలో ఆమె దృష్టి పెట్టకపోవడంతో ఆమె చేస్తున్న అన్ని సినిమాలు ఆమెకు నిరాశ కలిగిస్తూ వచ్చాయి. ఇక భవిష్యత్తులో సినిమాలు వస్తాయో రావో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న ఆ హీరోయిన్ ఇప్పుడు ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ప్రయత్నిస్తోంది.

కాదనకుండా

కాదనకుండా

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఫాలో అవుతూ క్రేజ్ పూర్తిగా తగ్గక ముందే కాస్త వెనకేసుకోవాని భావిస్తోంది. సినిమా ఆఫర్లు మొదలు షాప్ ఓపెనింగ్ లు, ఫోటో షూట్ లు ఇలా ఏ అవకాశం వచ్చినా కాదనకుండా రేట్లు పేఛీ పెట్టకుండా చేసేయాలని భావిస్తోందని తెలుస్తోంది. అందరూ తనకు ఆఫర్లు ఇచ్చే విధంగా భారీగా రేట్లు తగ్గించినట్లు సమాచారం.

ఆదాయ మార్గాలు అవే

ఆదాయ మార్గాలు అవే

ఒకప్పుడు ఆమె షాప్ ఓపెనింగ్ చేస్తే సుమారు 15 లక్షల రూపాయలు చదివించుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నాలుగు లక్షలు ఇస్తే చాలు ఎక్కడికైనా వస్తాను, ఏ షాప్ ఓపెనింగ్ అయినా చేస్తాను అంటోందట. అలాగే ఒకానొక సమయంలో ఫోటో షూట్ చేయడానికి కూడా సవాలక్ష కండిషన్లు పెట్టేది కానీ ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినా సరే ఫోటోషూట్ చేస్తానని చెబుతోందట. ఎందుకంటే పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమెకు ప్రస్తుతం చేతిలో ఉన్న ఆదాయ మార్గాలు ఈ షాపు ఓపెనింగ్లు, ఫోటో షూట్ లు మాత్రమే అని తెలుస్తోంది.

 బాయ్ ఫ్రెండ్ ని

బాయ్ ఫ్రెండ్ ని

ఆమెను సినిమా అవకాశాలు వరించక పోవడానికి మరో ముఖ్య కారణం ఉందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అదేమిటి అంటే ఆమె షూటింగ్ సమయంలో కూడా తన బాయ్ ఫ్రెండ్ ని సెట్స్ కు తీసుకువస్తున్నట్లు సమాచారం. సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో సింగిల్ గా ఉన్న హీరోయిన్లకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఒక వేళ బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే ఇలా వెంట పెట్టుకుని తిరిగితే ఎవరు మాత్రం పిలిచి అవకాశాలు ఇస్తారు.

రెడ్ కార్పెట్ పరుస్తారా

రెడ్ కార్పెట్ పరుస్తారా

అందుకే ఆమెకు ఇప్పుడు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు సినిమాలతో కాలం వెళ్లదీస్తున్నదని తెలుస్తోంది. ఆ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు చేరడంతో ఇప్పుడు కన్నడ, తమిళ సినీ పరిశ్రమల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె పిచ్చి కానీ అక్కడికి మాత్రం బాయ్ ఫ్రెండ్ ని వెంటబెట్టుకుని వెళితే వాళ్లు రెడ్ కార్పెట్ పరుస్తారా ఏమిటి?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X