బడా బాబుల కోరల్లో చిక్కిన హీరోయిన్.. కష్టపడి సినిమా అవకాశం వస్తే ఒక్క ఫోన్ తో అంతా మసే!

సినీ పరిశ్రమలో కాదు అన్ని రంగాల్లో కూడా రికమండేషన్ అనేది చాలా సర్వ సాధారణం. సినిమాల విషయానికి వస్తే తమకు కావలసిన వారిని దర్శకనిర్మాతలు సినిమాల్లోకి తీసుకోవడం కూడా దాదాపు జరిగే విషయమే. ఒక్కో సారి హీరో మాత్రం హీరోయిన్ లేదా ఇతర పాత్రలకు సంబంధించిన వారి పేర్లను సూచించడంతో మొహమాటం కొద్దీ దర్శకనిర్మాతలు ఆయా నటీనటులను సినిమాల్లోకి తీసుకునే సందర్భాలున్నాయి. అయితే టాలీవుడ్ లో ఒక హీరోయిన్ వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు సినిమాలు ఇవ్వకూడదు అంటూ పెద్ద స్థాయి వ్యక్తుల ఫోన్లు దర్శకనిర్మాతలకు వెళుతున్నాయట. ఆ వ్యవహారం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

కాస్త భిన్నంగా

కాస్త భిన్నంగా

సాధారణంగా చాలా మంది హీరోయిన్లు తమ తమ కాంటాక్టులు వాడి పెద్ద సినిమాలలో భాగమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. దర్శక నిర్మాతలు కూడా పెద్ద వాళ్ల నుంచి ఫోన్లు వస్తే ఇక తప్పదు అనుకున్నట్లుగా హీరోయిన్ అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే విషయం మాత్రం కాస్త భిన్నంగా అనిపిస్తుంది.

 బడా స్థాయి వ్యక్తులతో

బడా స్థాయి వ్యక్తులతో

ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు చెందని సదరు హీరోయిన్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి తెలుగులో స్థిరపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమ రాష్ట్రంలో ఉన్న బడా స్థాయి వ్యక్తులతో ఆమెకు పెద్ద పరిచయాలే ఉన్నాయట. అయితే సదరు వ్యక్తులకు ఆమె సినిమాలు చేయడం ఇష్టం లేదు. అయితే ఆమె మాత్రం వారి మాట వినకుండా హైదరాబాద్ వచ్చి కొత్త సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అలా ఆమె హైదరాబాద్ రావడం తనకు ఉన్న అందం, అభినయం తో కొన్ని సినిమా అవకాశాలు దక్కించుకోవడం జరుగుతూ ఉంటుంది.

 మాస్ హీరో సరసన

మాస్ హీరో సరసన

అయితే ఆ తర్వాత సదరు పవర్ఫుల్ వ్యక్తుల నుంచి దర్శకనిర్మాతలు రావడంతో ఆమె 2, 3 సినిమా అవకాశాలు పోగొట్టు కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఆమె అలాగే హైదరాబాద్ వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేయగా టాలీవుడ్ లో ఉన్న ఒక మాస్ హీరో సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది.

 హీరోయిన్ ను పక్కన పెట్టేందుకు

హీరోయిన్ ను పక్కన పెట్టేందుకు

ఇంకేముంది ఆమె పేరు అనౌన్స్ చేయడమే ఆలస్యం అని భావిస్తున్న తరుణంలో బడాబాబుల నుంచి ఫోన్ రావడంతో దర్శకనిర్మాతలు ఆమె పేరు పక్కన పెట్టి మరో భామను ఎంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సదరు సినిమా దర్శకుడికి బడా స్థాయి వ్యక్తులు నుంచి ఫోన్ వచ్చిందని ఆయన కాదనలేక హీరోయిన్ ను పక్కన పెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు..

చూడాలి మరి ఏమవుతుందో?

చూడాలి మరి ఏమవుతుందో?


అయితే ముందు ఒక హీరోయిన్ అనుకున్న తర్వాత ఆ హీరోయిన్ ను తప్పించి వేరే హీరోయిన్ ను తీసుకోవడం అనేది కూడా చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హీరోయిన్ బాధ కూడా ఎవరూ పట్టించుకునే అవకాశం అయితే లేదు. ఆమె సదరు బడా స్థాయి వ్యక్తులతో కూర్చుని మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశమే లేదని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏమవుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X