హీరోయిన్స్ పై కొరడా ఝళిపించారు...
మొన్న జరిగిన టాలీవుడ్ ట్రోపికి ఇలియానా, శ్రియ, తమన్నా..ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎస్కేప్ అయ్యార్ దాంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీరిపై చాలా ఆగ్రహంగా ఉన్నదని సమాచారం. కనీసం ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు తాము షూటింగ్ ల్లో ఉన్నామనీ కానీ..అవుట్ డోరో లో ఉన్నట్లుగానీ మెసేజ్ ఇవ్వలేదట. దాంతో ఈ ముగ్గురికి 'మా" కఠినమైన చర్యనే తీసుకోవాలని కూడా 'మా" అనుకుంటోందని సమాచారమ్..టాలీవుడ్ లో ఇదొక్కఎత్తైతే మరి తమిళంలో తెలుగు హీరోయిన్లు పై కొరడా ఝలుపించారు.
తమిళంలో ప్రముఖ నటీమణులైన జెనీలియా, అనుష్క, కాజల్ అగర్వాల్, హన్సికలు తమిళనాడులోని నడిగర సంఘం(ఆర్టిస్ట్స్ అసోషియేషన్)తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. తమిళంలో కూడా తమ హవాను కొనసాగిస్తున్న వీరు ఈ సంఘంలో సభ్యత్వం తీసుకోకపోవడమే ఇందుకు కారం. వెంటనే 'నడిగర సంఘం"లో సభ్యులుగా చేరమని ఆదేశించింది. లేని పక్షంలో ఈ హీరోయిన్లు భవిష్యత్తులో తమిళ సినిమాల్లో నటించకుండా నిషేదిస్తామంటూ హెచ్చరించారు. ఆ సంఘం అద్యక్షులు హీరో శరత్ కుమార్!


Click it and Unblock the Notifications











