తెలుగు హీరోయిన్స్-రెమ్యునేషన్స్ (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : సాధారణంగా సినిమా గురించి అడిగేటప్పుడు హీరోకి ఎంత ప్రయారిటీ ఇస్తామో..అంతే హీరోయిన్ గురించి అడుగుతూంటాము. అందుకే స్టార్ హీరోయిన్స్ ఓ రేంజిలో వెలిగిపోతూంటారు. అప్పట్లో సావిత్రి, వాణిశ్రీ, భానుమతి వంటి గొప్ప నాయికలు తాము ఏ పాత్ర చేసినా, వన్నె తెచ్చేవారు. అలా వారికి అభినయానికి ఆస్కారమున్న పాత్రలు లభించేవి. వారి నటనలో మహారాణులుగా చెలామణి అవుతున్నారు. అలాగే రెమ్యునేషన్స్ కూడా తారాస్ధాయికి వెళ్లాయి.

తెలుగు హీరోయిన్ స్థానం ఎప్పుడూ మరొకరికి ప్లేస్ ఖాళీ ఉండే ఓ పుష్ప క విమానం. ఎక్కడినుంచి అందాల భా మలను దిగుమతి చేసుకున్నా, ఎంతమందున్నా, మరొక మగువకోసం 'ఖాళీ' ఉంటుంది. పరభాషా కథానాయికలు అనేకమంది తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా రు. ఇప్పటికే అనేక మంది తమ అందం, నటనాప్రతిభతో ప్రేక్షకులకు అభిమాన తారలయ్యా రు. తెలుగు సినిమా పుట్టిన నాటినుండి పరభాషా కథానాయికలు తమ సత్తా చాటుతూనే ఉన్నారు.

ఎంతో మంది అమ్మాయిల నిత్యం తెలుగు చిత్ర సీమలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. అయితే వీరిలో కొద్దోగొప్పో నటించే సత్తా ఉన్న 'అదృష్టవంతుల'కు సినీ అందలం దొరుకుతోంది. అయితే, ఇప్పటి హీరోయిన్స్ కేవలం అందాల ఆరబోతకే పరిమితమవుతున్నారు. అదీ కూడా ఇప్పుడు నిర్మించే 'కుర్రకారు' చిత్రాలకోసం సత్తాలేని సుందరాంగులను ఎంపిక చేస్తున్నారు. జయసుధ తర్వాత 'హీరోయిన్' అనే పదానికి అర్ధం లేదన్న వాదనకు విజయశాంతి, సౌందర్యలు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పరిస్దితి మారింది.

దాదాపు రెండు దశాబ్దాల నుండి తెలుగు హీరోయిన్‌గా పరభాషా కథానాయికలే టాప్ 'చైయిర్' అందుకుంటున్నారు. ఒక్క 'రంభ' కొన్నాళ్లు టాప్‌లో కొనసాగినా, 'తెలుగమ్మాయి' అంటే అవకాశాలు తక్కువగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగమ్మాయిలు కూడా మేమున్నామంటూ పోటీలో నిలబడుతున్నారు. వారిలో అంజలి, శ్రీదివ్య, నందిత కనిపిస్తున్నారు.

గమనిక : క్రింద పేర్కొన్న హీరోయిన్స్ రెమ్యునేషన్స్ ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి మాత్రమే..అవి ఖచ్చితమైన లెక్కలు కావచ్చు..కాకపోవచ్చు....పెరగవచ్చు..తగ్గవచ్చు... పూర్తి పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

మన తెలుగు టాప్ హీరోయిన్స్ ...స్లైడ్ షోలో...

సమంత

సమంత

సమంత ఇప్పుడు కోటిన్నర వరకూ రెమ్యునేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది. పవన్ తో చేస్తున్న చిత్రం రిలీజ్ అయ్యాక రేట్ పెంచే అవకాసం ఉంది. ప్రస్తుతం తెలుగులో సమంత టాప్ స్టార్‌గా నిలచింది. ఆమె చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌వద్ద కనకవర్షాన్ని కురిపించడంతో సమంత డేట్స్‌కు డిమాండ్ పెరిగింది. మూడు నాలుగు షిఫ్టుల్లో పనిచేస్తు బిజీగా ఉంది. అగ్ర హీరోలందరి సరసనా నటిస్తోంది. ఆమె తాజా చిత్రం అత్తారింటికి దారేది త్వరలో విడుదల కానుంది.

ఇలియానా

ఇలియానా

మొన్న మొన్నటిదాకా తెలుగు చిత్రాల్లో తన అదృష్టంతో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా కోటిన్నర వరకూ తీసుకుంటోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌కు చేరింది . అయినప్పటికీ ఇలియానా తెలుగులో ఇప్పుడు నటిస్తానంటే వరస ఆఫర్స్ తో బిజీ అవుతుందంటున్నారు. ఆమె క్రేజ్ ఇప్పటికీ తెలుగు తెరపై తగ్గలేదు.

తమన్నా

తమన్నా


తమన్నా టాప్ స్ధాయికి వెళ్లినా ఆమె రెమ్యునేషన్ మాత్రం డబ్బై లక్షలకు మించలేదని వినికిడి. సమంత తర్వాత వరుసలో తమన్నా, అమలాపాల్, శృతిహాసన్, నిత్యామీనన్ ఉన్నారు. అయితే తమన్నా ఇప్పటికే మంచి నటిగా నిరూపించుకుంటూ ‘గ్లామర్ పాత్రలకూ సై' అంటోంది. తమన్నాలో విశేషమేమంటే, అటు పెద్ద హీరోలు, ఇటు యువ హీరోలు అనే తేడా లేకుండా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ అని పిలిచే తమన్నాకు డాన్స్ ఎసెట్!

అమలాపాల్

అమలాపాల్

గ్లామర్,నటన కలబోసినట్లు ఉండే అమలా పాల్ ...ముప్పై లక్షలకే సరిపెట్టుకుంటోంది. అమలాపాల్ చిన్న చిత్రాలతో పరిచయమైనా, పెద్ద హీరోయిన్‌గా ఎదిగింది. అయితే సరైన హిట్స్ లేకపోవడం మైనస్. నాగచైతన్యతో చేసిన ‘బెజవాడ', అల్లుఅర్జున్‌తో చేసిన ‘ఇద్దరమ్మాయిలతో' లాంటి చిత్రాలు గనుక విజయం సాధించి ఉంటే అమలా పరిస్థితి మరోలా ఉండేది. అయినా గానీ ఈ యువ హీరోయిన్ తన అందాలతో రేస్‌లో కొనసాగుతోంది.

శృతిహాసన్‌

శృతిహాసన్‌

కోటి రూపాయలు ఇస్తే శృతి హాసన్ ని తమ సినిమాల్లో తీసుకోవచ్చు అంటున్నారు. కమల్‌హాసన్ ముద్దుల తనయగా పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్‌కు మొదట్లో అంతా చుక్కెదురే. ‘అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెరంగేట్రం చేసి, సరైన హిట్ చిత్రాల్లో నటించలేకపోయింది. సూర్యతో చేసిన ‘సెవెన్త్ సెన్స్' మంచి చిత్రమైనా సరైన విజయం అందుకోకపోవడంతో శృతికి మైనస్ అయింది. ఒకానొక సమయంలో ‘ఐరన్‌లెగ్'గా ముద్ర పడింది. ఆమె నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్‌వద్ద పల్టీకొడుతుందన్న మాట ముద్రపడిపోయింది.

కానీ అనూహ్యంగా ‘గబ్బర్‌సింగ్' పవన్ పవర్‌తో విజయఢంకా మోగించి శృతికి ఉన్న ‘ఐరన్‌లెగ్' ముద్ర రూపుమాపింది. ఇక అక్కడినుండి శృతికి అవకాశాలు వస్తాయనుకున్నారు. కాని ఎందుకో రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు తాజాగా రవితేజతో ‘బలుపు' చిత్రం హిట్ సాధించింది. ఆ తరువాత రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘ఎవడు' రాబోతోంది. ఆ చిత్రం గనుక హిట్టయిందంటే టాలీవుడ్‌లో హ్యాట్రిక్ భామగా గుర్తింపు పొందుతుంది.

నిత్యామీనన్

నిత్యామీనన్

యూత్ కి కనికట్టులా పనిచేసే నిత్యామీనన్... 50 లక్షలు వరకూ తీసుకుంటోందని తెలుస్తోంది. లక్కీగాళ్‌గా గుర్తింపు పొందిన నిత్యామీనన్ స్లో అండ్ స్టడీగా కెరీర్ సాగిస్తోంది. తొలి చిత్రం సూపర్ హిట్టవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని అనుకున్నారు. ‘అలా...మొదలైంది' చిత్రం తర్వాత ఆమె చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో అవకాశాలు ఇచ్చేవాళ్లు వెనుకంజ వేసారు. సహజంగా పరిశ్రమలోకి వచ్చిన ప్రతీ హీరోయిన్ ఇక్కడ హీరోలు ఎవరు? ఎవరితో నటిస్తే ‘స్టార్‌డమ్' వస్తుందో లెక్కలువేసుకుని కెరీర్‌ను ‘ప్లాన్' చేసుకుంటారు.

నిత్య ఈ విషయంలో తప్పటడుగులే వేసింది. ఇక్కడి హీరోలతో తనకు పనిలేదంటూ, తన ‘టాలెంట్'తోనే అవకాశాలు వస్తాయని అనుకుంది. మంచి నటిగా గుర్తింపు పొంది, గాయకురాలిగా కూడా తన పాటలు తానే పాడుకున్న (మాతృభాష మలయాళం అయినా), ఎత్తు విషయంలో కొన్ని మైనస్ మార్కులు పడడంతో వెనుకంజ వేసింది. నితిన్‌తో చేసిన ‘ఇష్క్', ‘గుండెజారి గల్లంతయిందే' చిత్రాలు హిట్టయినా, ద్వితీయశ్రేణి హీరోయిన్‌గానే మిగిలిపోయింది.

కేథరిన్ థెరిస్సా

కేథరిన్ థెరిస్సా

ఇరవై లక్షలు కేధరిన్ తీసుకుంటోందని చెప్తున్నారు. చేసినవి తక్కువ చిత్రాలు అయినా క్రేజ్ తెచ్చుకోవటం ప్లస్ అయ్యింది. ‘ఇద్దరమ్మాయిలతో..' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కేథరిన్ థెరిస్సా ఇప్పుడు పరిశ్రమలో హాట్‌హాట్‌గా వినిపిస్తున్న పేరు. తమిళ, మలయాళ చిత్రాల్లో దాదాపు పది చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు చిత్రసీమలోకి దిగిపోయింది. లేలేత అందాల అందమైన భామగా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజ్‌లో వుంది. కేథరిన్ అందాలకు దిమ్మెత్తిపోయిన టాలీవుడ్ ఆమెను తమ చిత్రాల్లో తీసుకోవడానికి ముందుకొస్తున్నారు. కానీ తొలి చిత్రం సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కేథరిన్‌కు కష్టాలు తప్పేటట్లు లేవు. ‘పైసా' చిత్రంతో నానీతో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కూడా జత కట్టనుందని వినిపిస్తున్న వార్త. ఈ ముద్దుగుమ్మకి గనుక ఓ హిట్ పడింది అంటే టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

అంజలి

అంజలి


తెలుగు అమ్మాయి...అంజలి... రెమ్యునేషన్...నలభై నుంచి యాభై వరకూ అడుగుతోందని, అయితే ఇంకా బేరం ఆడి తగ్గిస్తున్నారని టాక్. తెలుగులో అవకాశాలు రాక తమిళ పరిశ్రమలో తన ‘టాలెంట్' నిరూపించుకుని తెలుగులోకి వచ్చింది అంజలి. ఆమె చేసిన ‘షాపింగ్‌మాల్'తో తెలుగులో గుర్తింపు వచ్చింది. అంతకుముందు యువ కథానాయికగా అలీ సరసన చేసిన చిత్రానికి రాలేదు. ఆ తర్వాత ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రంలో వెంకటేష్‌కి జోడీగా నటించి ‘సీతమ్మ'గా మన్ననలు అందుకుంది. ప్రస్తుతం ‘బలుపు' చిత్రంలో రవితేజతో జోడీ కట్టి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా విజయవంతం అవడంతో మార్కెట్ పై స్థాయికి ఎదిగింది.

శ్రీదివ్య

శ్రీదివ్య

పెద్దగా డిమాండ్ లేని శ్రీ దివ్య...ఐదు లక్షలు వరకూ రెమ్యునేషన్ తీసుకుంటోందని తెలుస్తోంది. అంజలి కాక ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న తెలుగమ్మాయిలు నందిత, శ్రీ దివ్య, సరికొత్త అందాలను తెలుగుతెరపై ఆరబోస్తున్నారు. విశేషమేమంటే ఈ ఇద్దరూ మంచి నటీమణులు అవడమే! శ్రీదివ్య నటించిన ‘బస్‌స్టాప్' చిత్రం నటిగా ఆమెకు గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' అంటూ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను వంద మార్కులు పడుతున్నాయి. త్వరలో మరిన్ని చిత్రాల్లో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి.

నందిత

నందిత


ఎనిమిది నుంచి పది లక్షలు వరకూ నందిత తీసుకుంటున్నట్లు సమాచారం. ‘నీకు నాకు డాష్‌డాష్' చిత్రంతో పరిచయమైన నందిత కూడా తన తరువాతి చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్'తో మంచి నటిగా నిరూపించుకుంది. ఈ చిత్రంలో నందిత నటనే హైలెట్ కావడంతో సినిమా విజయఢంకా మోగిస్తోంది. దీంతో నందిత మలయాళ చిత్ర సీమలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం తెలుగమ్మాయిలైన శ్రీదివ్య, నందితాలు మెరుపుతీగల్లా తెలుగు తెరపై కనువిందు చేయనున్నారు. చాలాకాలం తర్వాత తెలుగమ్మాయిల హవా మళ్లీ మొదలవుతోందన్నమాట.

త్రిష

త్రిష

డిమాండ్ తగ్గినా త్రిష..ముప్పై లక్షలకు మాత్రం తగ్గటం లేదు. డేట్స్ ఎక్కువ రోజులు అయితే ఇంకా రేటు పెంచుతోంది. ఎందుకనో త్రిషకు ఆఫర్స్ ఈ మద్యన సన్నగిల్లాయి. బాడీగార్డ్ ఫ్లాప్ తర్వాత త్రిషకు ఆఫర్సే తెలుగులో రావటం మానేసాయి. అయినా ఆమెను పెద్ద హీరోల సినిమాల్లో బుక్ చేయాలని దర్శక,నిర్మాతలు ట్రై చేస్తూనే ఉన్నారు. ఇక స్టార్ హీరోలతో సినిమాలు లేవనుకొంటున్న తరుణంలో త్రిషకి ఓ కొత్త ఆఫర్ వచ్చి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ భామ తమిళ,తెలుగు భాషల్లో హీరోగా వెలుగుతున్న సూర్య సరసన ఆడిపాడబోతోంది.

కాజల్

కాజల్

కాజల్ కి తమిళ,తెలుగు భాషల్లో డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె కోటి ముప్పై లక్షల దాకా డిమాండ్ చేస్తోంది. ఈ సంవత్సరం ‘బాద్ షా' చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ త్వరలో ‘ఎవడు' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. ఆమె దృష్టి బాలీవుడ్ పై ఉండటంతో తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేకుండా పోయింది. అయినా మళ్ళీ ఈ సంవత్సరం ఆమె బిజీ అవుతుందని భావిస్తోంది.

అనుష్క

అనుష్క

అనుష్క రెమ్యునేషన్ గా రెండు కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుష్క రెండు భారీ బడ్జెట్ చారిత్రక చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రమదేవి కాగా, మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి. మరో ప్రక్క ఆమె నటించిన వర్ణ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూడు చిత్రాలతో ఆమె టాలీవుడ్ మహారాణిగా వెలుగుతోంది.

నయన తార

నయన తార

నయనతార తన రెమ్యునేషన్ గా ... రెండు కోట్లు పై చిలుకే డిమాండ్ చేస్తోంది. అదీ తమిళ, తెలగు భాషలకి కలిపి అయితే ఒక రేటు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి అయితే ఓ రేట్ తీసుకుంటోందని సమాచారం. నయనతార చివరగా తెలుగులో ‘కృష్ణం వందే జగద్గురుమ్', ‘గ్రీకు వీరుడు' చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అనామిక చిత్రం చేస్తోంది.

తాప్సీ

తాప్సీ

రీసెంట్ గా... సాహసం చిత్రంతో హిట్ లోకి వచ్చిన తాప్సీ... ఇరవై ఐదు లక్షలు తీసుకుంటోంది. తాప్సీ మాట్లాడుతూ "చాలా రోజులుగా నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చింది! తొలి వారాంతానికి 70 శాతం బడ్జెట్ రికవరీ అవడంతో 'సాహసం' హిట్టయ్యిందని సంతోషంగా చెబుతున్నా. దీనికి కారకులైన మీకు థాంక్స్. ఈ సినిమాలో నేను చాలా అందంగా కనిపించానని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయంలో నాకు మేకప్ చేసిన నిక్కీ రజనికీ, కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన దివ్య, లిప్సకు థాంక్స్ చెప్పుకుంటున్నా'' అని తెలిపింది. ప్రస్తుతం తమిళంలో ఆర్య సరసన 'వాలై', లారెన్స్ సరసన 'ముని 3' సినిమాలు చేస్తోంది తాప్సీ .

హన్సిక

హన్సిక

తెలుగు,తమిళ భాషల్లో చేస్తున్న హన్సిక కు .. ఇరవై నుంచి పాతిక లక్షలు వరకూ డిమాండ్ ఉంది. తెలుగులో పెద్దగా డిమాండ్ లేకపోయినా తమిళంలో ఆమెకు వరస ఆఫర్స్ ఉండటం ప్లస్ అవుతోంది. తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస అవకావాలతో దూసుకుపోతున్న హీరోయిన్ హన్సిక. ఆమె నటించిన ‘సంథింగ్ సంథింగ్' చిత్ర ఇటు తెలుగుతో పాటు, అటు తమిళంలోనూ విడుదలైంది. ఈ సంవత్సరం ఆమె శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాతో పాటు, హలో బ్రదర్ రీమేక్ లో నటించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X