టాలీవుడ్ మొత్తం ఆయన వైపే.. కారణం ఇదే!
సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంటుంది. చిత్ర పరిశ్రమపై రాజకీయాల ప్రభావం ఉంటుందనేది వాస్తవమే. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో రాజకీయాల గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. మంగళవారం రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులలో ఉత్కంఠ నెలకొని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఉత్కంఠ ఎందుకు.. టాలీవుడ్ ప్రముఖులు ఎవరు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం!

మళ్ళీ ఆయనే రావాలి
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది తిరిగి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకు కారణం మాజీ తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ అట. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయన నడిపిన సత్సంబంధాలు, సినీప్రముఖులతో ఆయనకున్న స్నేహం కారణంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న టిఆర్ఎస్ అధికారంలోకి రావాలని టాలీవుడ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం
టాలీవుడ్ కు ప్రభుత్వం తరుపు నుంచి ప్రోత్సాహం అందిస్తూనే, కేటీఆర్ వ్యక్తిగతంగా చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రోత్సహించారు. దీనితో టాలీవుడ్ లో కేటీఆర్ కు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. కేటీఆర్ తో సన్నిహితంగా మెలిగేవారిలో బడా నిర్మాతలు, హీరోలు ఉన్నారు. కొన్ని చిత్రాల ఈవెంట్స్ కి కూడా కేటీఆర్ హాజరైన సందర్భాలు ఉన్నాయి.

స్టార్ హీరోలతో
రాంచరణ్, మహేష్ బాబు , దగ్గుబాటి కుటుంబం, అల్లు అరవింద్ ఇలా బడా సెలెబ్రిటీలతో కేటీఆర్ కు మంచి స్నేహం ఉంది. రాంచరణ్ ధృవ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. కేసీఆర్ కూడా టాలీవుడ్ నిర్వహించిన కొన్ని ఈవెంట్స్ కు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించినప్పుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేసారు. మహేష్ తో కలసి ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు.

సామజిక కార్యక్రమాల్లో
సామజిక కార్యక్రమాల్లో టాలీవుడ్ సెలెబ్రిటీలు స్వచ్చందంగా పాల్గొనేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఉదాహరణకు సమంత తెలంగాణ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. హరిత హారం లాంటి కార్యక్రమాల్లో హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులంతా పాల్గొన్నారు. రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ ఎన్నికల ఫలితాలు సినీ ప్రముఖుల్ని కూడా ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











