»   »  రక్షణ కరవయిందంటున్న హీరోయిన్...

రక్షణ కరవయిందంటున్న హీరోయిన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mamta Mohandas
హస్కీ వాయిస్ తో గాయనిగానూ, అందాల ప్రదర్శనతో హీరోయిన్ గానూ తెలుగు పరిశ్రమను అలరిస్తూ దూసుకు వెళ్తోన్న మళయాళి భామ మమతామోహన్ దాస్. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ పై నిప్పులు చెరుగుతోంది. తాజాగా ఆమెకు బెస్ట్ యాక్ట్సెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిన సంతోషాన్ని మీడియాతో పంచుకుంటూ మధ్యలో తెలుగు పరిశ్రమని,అందులోని వ్యక్తుల ప్రవర్తనలపై నిరసన వ్యక్తం చేసింది. ఇక్కడ ఆడవారికి సేఫ్ లేదంటూ బహిరంగంగా విమర్శల రూపంలో మనసులో మాట బయిట పెట్టింది.

అయితే కాస్సేపటికి తన స్టేట్ మెంట్ తో లేని పోని తలనొప్పులొస్తాయని అర్ధం చేసుకుని ఆ భాధ అందరి హీరోయిన్లకీ ఉండదని అది వారి పర్శనల్ కారెక్టర్ ని బట్టి ,బిహేవర్ ని బట్టి ఉంటుందని కవర్ చేసింది. మొన్న విక్టరీలో కనిపించిన ఆమె ప్రస్తుతం జె.డి చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న హోమం లో చేసింది. ఎవరిని ఉద్దేశించి ఆమె ఆ మాటలు అన్నా పరిశ్రమలో అందరికీ తగిలేలా ఉందని అందరూ ఆలోచనలో పడుతున్నారు. గతంలోనూ ఆమె జె.డి పై ఆమె తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తిన సంగతి తెలిసిందే.

తనని సెక్సువల్ గా హెరాస్ చేస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా అందంటే తెర వెనక యేదో చిరాకుని ఆమె పొందిందని...అదేంటనేది త్వరలోనే బయిటకు వస్తుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినపడుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X