చిరు తో సహా మెగా హీరోలకి ఝలక్ ఇచ్చిన మెగా డైరెక్టర్స్..!?
మనిషి రాజకీయాల్లో ఉన్నా సినిమా పై ఛావా ఇంకా చిరింజీవిలో పోలేదు. చిరు ఆశ్చర్యంగా రాజకీయ జిమ్మిక్కులను చిత్రాల మీద ప్రదర్శిస్తున్నాడు..ప్రత్యేకంగా 150వ చిత్రం విషయంలో ఘడియకో మాట మాట్లాడి అందరికీ చెడ్డవాడవుతున్నాడు. ఉత్తుత్తీ వేదికైన 'బుడ్డా" ప్రీమియర్ షోలో రెచ్చిపోయి సమయం సందర్భం లేకుండానే పూరీ జగన్నాథ్ కి కమిటయిపోవడంతో ఇన్నాళ్లూ మెగాస్టార్ ని ప్రసన్నం చేసుకొని ఎలాగైనా ఆయన 150వ ప్రాజెక్ట్ కొట్టేయాలనుకున్న వారందరూ వివర్స్ గేర్ వేశారట.
ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్, చిన్నికృష్ణ, శ్రీకాంత్ అడ్డాల, వివి వినాయక్, బి గోపాల్ లాంటి వారు చిరంజీవికి సహాయనిరాకరణ ప్రకటించుకున్నారు. పూరీ తనకు తానే కథ - స్ర్కీన్ ప్లే-మాటలు రాసుకుంటాడు కనుక వీరెవ్వరికీ చిరంజీవితో ఇక పనుండదు. మున్ముందు మెగా కాంపౌండ్ హీరోలెవరికీ సహాయపడేది లేదంటూ వీరిలో వీళ్లే ప్రతిజ్ఝలు చేసేసుకొని చిరుని ఇక నుండి బేఖాతరు చేస్తామంటున్నారట. రాజకీయనాయకుడిగా ఎలాగూ పాపులారిటీ లేదు ఇప్పుడిలా పూరీ దెబ్బతో సినీ ఫీల్డులోనూ నమ్మకాన్నీ పోగొట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి....


Click it and Unblock the Notifications











