బాలీవుడ్ సినిమాలకు థమన్ గ్రీన్ సిగ్నల్.. మలయాళంలో కూడా..?
యువ సంగీత సంచలనం SS.థమన్ సౌండ్ ఇప్పుడు నలువైపులా వినిపిస్తోంది. అల..వైకుంఠపురములో సినిమాలోని పాటలు యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడంతో ఆ కారణంగా అన్ని ఇండస్ట్రీ నుంచి భారీ ఆఫర్స్ అందుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా కూడా థమన్ వచ్చిన ఆఫర్స్ కి ఏ మాత్రం నో చెప్పడం లేదట. వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని తీసుకొని ట్యూన్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాడట.
గత ఏడాది గ్యాప్ లేకుండా వర్క్ చేసిన థమన్ ఈ ఎడాది కూడా తన స్టూడియోలో ట్యూన్స్ రెడీ చేస్తూ బిజీగా మారాడు. ఓ విధంగా షూటింగ్స్ ఆగిపోయిన కూడా థమన్ పని మాత్రం ఆగడం లేదు. తన టీమ్ ని ఆఫీసులోనే ఉంచుకోని ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట. వకీల్ సాబ్, క్రాక్ సినిమాలకు దాదాపు ట్యూన్స్ అన్ని రెడీ చేసిన థమన్ నెక్స్ట్ టక్ జగదీశ్ తో పాటు మరో మూడు తెలుగు సినిమాలకు ట్యూన్స్ రెడీ చేయనున్నాడు.

ఇక బాలీవుడ్ నుంచి కూడా ఇటీవల రెండు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వాటిపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందట. ఇక మొదటిసారి ఒక మలయాళం సినిమాకు కూడా మ్యూజిక్ అందించబోతున్నాడట. మళయాళం హీరో పృథ్వీరాజ్ చేస్తున్న కడువ అనే సినిమాకు థమన్ బాణీలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే థమన్ ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో కొత్తగా వస్తున్న ఆఫర్స్ కి ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











