ఫ్లాప్ ఇచ్చినా కూడా మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న నాని.. మరో డిఫరెంట్ మూవీ!
టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నాని ఇప్పుడు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా దసరా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుకుమారి శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
అయితే దసరా సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడుతో నాని సినిమాను ఇటీవల లాంచ్ చేసిన విషయం తెలిసింది. అలాగే తనకు ఫ్లాప్ ఇచ్చిన మరొక దర్శకుడితో కూడా నాని త్వరలోనే మరొక ప్రాజెక్టు గురించి అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆదర్శకుడు మరెవరో కాదు అంటే సుందరానికి.. అనే సినిమాతో నానికి గత ఏడాది ప్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయ అని తెలుస్తోంది. అంతకు ముందు వివేక్ మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా అనే డిఫరెంట్ కామెడీ సినిమాలను తెరపైకి తీసుకువచ్చాడు.

ఈ దర్శకుడు నానితో లక్కీ చాన్స్ అందుకున్నాడు కానీ అంటే సుందరానికి సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఇప్పుడు మరొక ప్రాజెక్ట్ తెరపైకి తీసుకురావడానికి మళ్లీ ఈ కాంబినేషన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాని అసలు కథ గురించి మొత్తం కూడా దర్శకుడితో చర్చలు జరిపాడట. అయితే కొన్ని మార్పులు చేర్పులు అవసరమని కూడా సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దసరాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కాస్త బిజీగా ఉన్న నాని మరో కొత్త ప్రాజెక్టుపై కూడా చర్చల దశలో ఉన్నాడు. అయితే ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత మరోసారి వివేక్ ఆత్రేయతో చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఫైనల్ కథ నచ్చితే ఇదే ఏడాది షూటింగ్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. మరి ఆ ప్రాజెక్టుపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











