For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరిపోయే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్.. అన్ని సినిమాలు ఉన్నా బాలయ్యకు తిరుగులేదుగా.!

    By Manoj
    |

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీలు అనుకున్నంత స్థాయిలో ఢీలా పడ్డారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో చాలా నష్టాలను ఎదుర్కొన్న ఆయన.. చాలా రోజుల పాటు మరో సినిమాను ఓకే చేయలేదు. ఆ సమయంలో ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చినప్పటికీ.. తనకు 'జై సింహా' వంటి హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్‌తో 'రూలర్' అనే సినిమా చేశాడు. సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని, దీని వల్ల రూలర్‌కు తిరుగుండదని తాజాగా ఓ వార్త ప్రచారం అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? వివరాల్లోకి వెళితే...

    అన్నింటికీ మంచి రెస్పాన్స్

    అన్నింటికీ మంచి రెస్పాన్స్

    బాలయ్య ‘రూలర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసేసింది. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వీటన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా టీజర్, ట్రైలర్‌లో బాలయ్య చెప్పిన డైలాగులు పేలుతున్నాయి.

    ఈ సినిమా కోసం ఎంతో చేశాడు

    ఈ సినిమా కోసం ఎంతో చేశాడు

    రూలర్ కోసం బాలయ్య ఎంతో కష్ట పడ్డారు. గతంలో లావుగా కనిపించిన ఆయన.. ఈ సినిమాలో మాత్రం ఎంతో స్లిమ్‌గా దర్శనమిస్తున్నారు. దీని కోసం బాలయ్య జిమ్ములో చెమటోడ్చుతున్నారని తెలిసింది. ఈయన మొత్తంగా 18 కేజీల బరువు తగ్గారు. అందుకే ఇంత స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఈ లుక్కులో ఆయన ఎంతో స్టైలిష్‌గా ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్

    ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్

    వాస్తవంగా బాలకృష్ణ సినిమా విడుదల అవుతుందంటే.. నందమూరి అభిమానులు ఖుషీగా ఉంటారు. కానీ, ఈ సినిమా వస్తుంటే మాత్రం వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం.. విడుదలకు వారం ముందే ‘వెంకీ మామ' సినిమా వచ్చింది. అలాగే, ‘రూలర్'తో పాటు సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే', సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3', కార్తి ‘దొంగ' విడుదల అవుతుండడమే.

    వాళ్లు వాళ్లే సర్ధుకోవాలి

    వాళ్లు వాళ్లే సర్ధుకోవాలి

    ‘వెంకీ మామ' నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ‘దబాంగ్ 3' సినిమానూ విడుదల చేస్తోంది. దీంతో థియేటర్స్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, ‘ప్రతిరోజూ పండగే' ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ కార్తీ నటించిన ‘దొంగ' సినిమాను విడుదల చేస్తుంది. ఈ సినిమాలు కూడా థియేటర్స్ సర్ధుబాటు చేసుకోవాలి. అంటే ఇవన్నీ లిమిటెడ్ థియేటర్స్‌లోనే ఆడాలి.

    అదిరిపోయే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్

    అదిరిపోయే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్

    తమ సినిమా వచ్చిన రోజు ఎన్ని వచ్చినా నష్టం జరగకుండా ‘రూలర్' ప్రొడ్యూసర్ సీ కల్యాణ్ అదిరిపోయే ప్లాన్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలవబోతున్న మూడు సినిమాలు థియేటర్లను సర్ధుబాటు చేసుకోవాల్సి వస్తున్నా.. రూలర్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం తమ సినిమానే ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యేటట్లు ప్లాన్ చేసుకున్నారని సమాచారం.

    English summary
    Nandamuri Balakrishna is looking lean. The 60-year-old actor has slimmed down. He lost nearly 8 kgs to look fit for a role in ‘Ruler’. The new still that was released today gives a glimpse of his slim avatar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X