తండ్రి కాబోతున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. శుభవార్త అంటూ మీడియాలో హల్‌చల్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దిల్ రాజు మొదట ఒక డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టారు. ఇక అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఒక క్రేజ్ అందుకున్న రాజు, దిల్ సినిమా నుంచి నిర్మాతగా తన ప్రొడక్షన్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఇక దిల్ రాజు పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన మొదటి భార్య అనిత మృతి చెందగా ఆ తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే త్వరలోనే దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

అందరి హీరోలతో..

అందరి హీరోలతో..

డిస్ట్రిబ్యూటర్ గా మొదట చిన్న సినిమాలతో మొదలైన దిల్ రాజు ప్రయాణం ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా ఎదిగే వరకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు దాదాపు ఇండస్ట్రీలో ఒకరిద్దరితో తప్పితే అందరి హీరోలతో కూడా సినిమాలు చేయడం జరిగింది. కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా చేసి భారీ విజయాన్ని అందుకోగల నిర్మాతగా ఆయన చాలాసార్లు

బిజినెస్ స్ట్రాటజీ

బిజినెస్ స్ట్రాటజీ

దిల్ రాజు ఒక కథను బలంగా నమ్మితే ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వగలరు అని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు దాదాపు నైజాంలో ఉన్న దియేటర్స్ అన్నిటిని కూడా తన బిజినెస్ స్ట్రాటజీ తో కొనసాగిస్తున్నారు అనేది ఎప్పటికీ ఒక టాక్ అయితే వినబడుతూనే ఉంటుంది. నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే దిల్ రాజు కొత్త దర్శకులకు కొత్త నటీనటులు కూడా మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు.

మొదటి భార్య మరణంతో..

మొదటి భార్య మరణంతో..

అయితే దిల్ రాజు వరుస విజయాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకోవడంతో ఆయనపై మీడియా ఫోకస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక దిల్ రాజు పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయిమ్ 2017 లో దిల్ రాజు భార్య అనిత హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దిల్ రాజు తీవ్రస్థాయిలో మనోవేదనకు గురయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కూడా ఆయన కొంత సమయం పట్టింది.

అలా రెండో పెళ్లి..

అలా రెండో పెళ్లి..

ఇక దిల్ రాజు ఏకైక కూతురు హన్షిత ఎక్కువగా ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వారి సన్నిహితుల అమ్మాయి తేజస్విని రెడ్డిని దిల్ రాజు లాక్ డౌన్ లో ఎలాంటి హడావుడి లేకుండా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

50 ఏళ్ళ వయసులో తండ్రి

50 ఏళ్ళ వయసులో తండ్రి

ఇక ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం దిల్ రాజు 50 ఏళ్ళ వయసులో తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన రెండో భార్య రాబోయే రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.
ఇక దిల్ రాజుకు ఉన్న ఏకైక కూతురు హన్షిత రెడ్డికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

వారసుడి కోసం..

వారసుడి కోసం..

తన మనవడితోనే దిల్ రాజు ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు అని నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన తాత అయిన తర్వాత మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు వారసుడు లేని లోటును తీర్చుకోవాలి అనే ఆలోచనతోనే ఉన్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X