టాలీవుడ్ హీరోకి 'సినిమా' కష్టాలు.. మధ్యలో హ్యాండిచ్చి మరో సినిమా మొదలెట్టిన నిర్మాత!

సాధారణంగా సినిమాల్లో చూపించే కష్టాలను ప్రస్తావించడానికి సినిమా కష్టాలు అని అంటూ ఉంటారు కానీ ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా అనేక కష్టాలను దాటుకుని రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు పూర్తి కావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. ఎవరా హీరో? ఏమిటా సినిమా అనే వివరాల్లోకి వెళితే.

డైలమాలో పడినట్లు

డైలమాలో పడినట్లు


తెలుగులో ఆయన ఒక టాలెంటెడ్ హీరో. ఇప్పటిదాకా ఆయన 20 సినిమాలకు పైగా హీరోగా నటించాడు. కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు స్టార్ హోదా తెచ్చి పెట్టలేక పోయింది. ఆయన చివరిగా హీరోగా నటించిన సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆయన తన రెమ్యునరేషన్ కూడా చాన్నాళ్ల తర్వాత పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ విషయం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

హీరో చేతిలో పెట్టి

హీరో చేతిలో పెట్టి


సినిమా పూర్తయి విడుదల అయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని హామీ ఇచ్చిన ప్రొడ్యూసర్ సడన్గా ఇక సినిమా తలనొప్పి నీదే నేను ఈ ఆర్థిక బాధలు పడలేను అని తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బయట ఎక్కడా ఫైనాన్స్ కి డబ్బులు దొరకడం లేదని ఆ కాలు నొప్పి ఇంకా భరించడం తన వల్ల కాదని కుదిరితే సినిమా పూర్తి చేసి విడుదల చేసుకోమని మొత్తం అంతా హీరో చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సదరు హీరో ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు.

ఇబ్బందులు పడుతున్నట్టు

ఇబ్బందులు పడుతున్నట్టు

కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అయితే ఈ సినిమా తనకు బాగా కలిసి వస్తుందని సదరు హీరో భావించాడు. ఈ మధ్యనే ఒక బడా హీరో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. నిర్మాత పెట్టిన డబ్బుతో 20% సినిమా పూర్తి చేశారు కానీ ఇప్పుడు మిగతా సినిమా పూర్తి చేయడం కోసం హీరో అనేక ఇబ్బందులు పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

కొత్త సినిమా ప్రారంభించి

కొత్త సినిమా ప్రారంభించి


అయితే సినిమా మీద నమ్మకం ఉండటంతో హీరో తనకు తెలిసిన బడాబాబులు అందరికీ ఫోన్లు చేసి ఈ సినిమాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా జరుగుతుంటే తన దగ్గర డబ్బులు లేవని తప్పుకున్న నిర్మాత మాత్రం సైలెంట్ గా కొత్త హీరో తో మరో కొత్త సినిమా ప్రారంభించినట్లు తెలిసింది.

చూడాలి మరి

చూడాలి మరి


దీంతో ఇప్పుడు అసలు డబ్బులు లేవని తప్పుకున్న నిర్మాత మరో కొత్త సినిమా ఎలా ప్రారంభించాడు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. హీరో కు నిర్మాతకు మధ్య దూరం పెరిగిందని, అందుకే పెట్టిన డబ్బు వెనక్కి రాకపోయినా పర్వాలేదు కానీ ఈ హీరోతో సినిమా చేయను అంటూ ఆ నిర్మాత పక్కకు వెళ్లి పోయినట్లు టాక్ వినిపిస్తోంది. మరి సదరు హీరో ఇప్పటికైనా సినిమా పూర్తి చేస్తాడో లేక ఏం చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏమవుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X