రామ్ గోపాల్ వర్మ మీద టాలీవుడ్ లో బ్యాడ్ రూమర్...
భారత దేశంలో ఏ ప్రాంతానికి పోయినా వర్మ గురించి సినిమా అభిమానుల్లో తెలియని వారుండరు తెలుగు దర్శకుడైన, జాతీయ దర్శకుడగా పేరొందారు. రామ్ గోపాల్ వర్మ ఎంతో జీనియస్ అని, తను చూపించదలచుకున్నది వెండి తెరపై ధైర్యంగా చూపించగలడని ప్రజలకు పెద్ద విశ్వాసం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో రీసెంటుగా వర్మ రక్త చరిత్ర తీసి వివాదాలకు తెరలేపాడు. రెండవ భాగాన్ని కూడా తీసి తన సత్తా చూపాడు. ఇలాంటి డైనమిక్ వర్మ మీద టాలీవుడ్ ఒక ప్రచారం జరుగుతోంది. ఫిలింగర్ లో వార్తలలో వర్మ పేరు ప్రముఖంగా చెప్పుకుంటున్నారు.
వర్శకు కులం పిచ్చి ముదిరిందని ఆయనకు 'కుల" బిరుదుని అంటకడుతున్నారు. వర్మ రాజు కులానికి సంబంధించిన వ్యక్తి కావటం ఇందుకు కారణం. రీసెంటుగా రామ్ గోపాల్ వర్మ నిర్మించిన చిత్రం కేయస్ డి అప్పుల్రారాజు ఈ చిత్రంలో టైటిల్ రోలును కమిడియన్ హీరో సునీల్ నటిస్తున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే. టైటిల్ రోలు వేస్తున్న సునీల్ కూడా రాజు కులానికి సంబంధించిన వ్యక్తి కావటం. వర్మ తదుపరి సినిమా 'దొంగల ముఠా" ఈ సినిమాలో హీరోగా రవితేజ నటిస్తున్నాడు. ఇంకా సుబ్బరాజు, కృష్ణుడు సినిమాలో మొయిన్ పాత్రలు వేస్తున్నారు. వీళ్లిద్దరు కూడా రాజు కమ్యూనిటికి చెందినవారు. ఫిలిం నగర్ లో గుసగుసలు ప్రకారం రాజులందరికి వర్మ దగ్గర చోటు లభిస్తుందని తెగ చెప్పుకుంటున్నారు.
కాని వర్మకు నిజంగా కుల ఫీలింగ్ ఉందో లేదో కాని, బైట మాత్రం వర్మ విషయంలో కేవలం టాలెంటుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని జనరల్ టాక్. తన దగ్గర పనిచేసిన ఎంతో మంది దర్శకులకు వర్మ ప్లాట్ ఫారమ్ గా ఉన్నాడు. అలాగే నటులకు కూడా టాలెంటును చూసే వేషాలను ఇచ్చే గుణం ఉందని చెప్పుకుంటారు.బ్యాడ్ లక్ ఏమిటంటే..కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోవడంతో వర్మను ఈ విధంగా అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











