twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ కోసం మరోసారి పోటీకి దిగిన సీనియర్ దర్శకులు?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ దర్శలుకులకు హీరోలు దొరకడం లేదు. కథకు సెట్టయిన హీరోలు నో చెబుతుంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్న హీరోలు వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే నెక్స్ట్ బాలకృష్ణ ఒక్కడే ఖాళీగా ఉంటాడు కాబట్టి ఆయన డేట్స్ కోసం కొందరు సీనియర్ దర్శకులు పోటీ పడుతున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు బి.గోపాల్, వివి.వినాయక్.

    ఈ ఇద్దరు దర్శకులతో కూడా బాలకృష్ణకు మంచి స్నేహం ఉంది. ముఖ్యంగా బి.గోపాల్ తో హ్యాట్రిక్ విజాయాలతో ఒకప్పుడు బెస్ట్ కాంబినేషన్ గా క్రేజ్ అందుకున్నారు. అయితే గత రెండేళ్లుగా బాలకృష్ణతో సినిమా చేయాలని గోపాల్ చేయని ప్రయత్నం లేదు. కానీ బాలయ్యకు సరైన కథ తీసుకురకపోవడం వలనే ప్రాజెక్టు రిజెక్ట్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా స్టార్ రైటర్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న సాయి మాధవ్ బుర్రా చేత ఒక కమర్షియల్ మాస్ కథను రెడీ చేయించారట.

    Tollywood Senior directors target on Balakrishna dates

    స్టోరీ లైన్ పై ఇంట్రెస్ట్ చూపించిన బాలయ్య ఫుల్ స్క్రిప్ట్ సిద్దమైన తరువాతనే ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామని అన్నారట. దీంతో బి.గోపాల్ లాక్ డౌన్ లో పూర్తిగా అదే స్క్రిప్ట్ పై కూర్చున్నారట. ఇక త్వరలోనే బాలయ్యను కలుసుకోవాలని రెడీ అవుతున్న తరుణంలో ఊహించని విధంగా బాలయ్య నెక్స్ట్ సినిమా డేట్స్ కోసం వినాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు మరో టాక్ వస్తోంది.

    చిరంజీవి ఆచార్య తరువాత బాబీ, మెహర్ రమేష్ లలో ఎవరో ఒకరితో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందట. ఇక మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ కి డైరెక్టర్ గా సెలెక్ట్ అయిన వినాయక్ ఆ సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా బాలయ్య కోసం ఒక కథను రెడీ చేసి ఉంచినట్లు సమాచారం. మరి బాలయ్య ముందు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

    English summary
    Boyapati Srinivas is coming up with the next Nandamuri Balakrishna movie. Since then, there has been a dose of anticipation among fans that Balakrishna will be appearing in the new gateways as never before. But even when the budget figures are down, the director is not slowing down. This is not a Baahubali movie as the budget figures are rising .. Ballaya Movie is coming up with comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X