సినిమాలో కుర్ర హీరోయిన్.. టెన్షన్ పడుతున్న బడా హీరో.. ఏమవుతుందో అని ముందు జాగ్రత్త!
టాలీవుడ్ లో హీరోలు ఎంత వయసు ఉన్నా సరే వారి పక్కన నటించే హీరోయిన్లు మాత్రం మంచి క్రేజ్ ఉన్న వారిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే తన వయసు లో సగం వయసు ఉన్న హీరోయిన్ తో నటిస్తున్న ఒక బడా హీరో ఇప్పుడు తన లుక్ విషయంలో టెన్షన్ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసలు ఎవరా హీరో? ఏమిటా కధ? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కొత్త టెన్షన్
టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న ఒక బడా హీరో కి మంచి మాస్ హీరోగా పేరు ఉంది. ఎలాంటి ఫైట్ అయినా డాన్స్ అయినా వెనకడుగు వేయకుండా డూప్ కూడా అవసరం లేకుండా చేస్తాడని ఆయనతో పని చేసిన టెక్నీషియన్స్ చెబుతూ ఉంటారు. సెట్స్ ల ఆయనతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని ఆయనతో పనిచేసిన అందరూ చెబుతుంటారు. అయితే ఇప్పుడు సదరు హీరో గారికి కొత్త టెన్షన్ ఒకటి పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇరవై ఏళ్ళు చిన్న వాళ్లు
ఈ మధ్య కాలంలోనే మంచి హిట్ అందుకున్న సదరు హీరో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ లో నటిస్తున్నాడు. అయితే ఆయన ఇప్పుడు తన లుక్ గురించి భయపడుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఆయన వయసు ఎక్కువే కానీ కుర్ర హీరోయిన్లతో నటించడమే. ఆయన నటిస్తున్న హీరోయిన్ లలో కొంతమంది ఆయన కంటే ఇరవై ఏళ్ళు చిన్న వాళ్లు కూడా ఉన్నారట.

సినిమాటోగ్రాఫర్ ను పిలిచి
ఆయన తాజాగా నటిస్తున్న సినిమాలో ఆయనకి జోడిగా నటిస్తున్న హీరోయిన్ కు కేవలం 20 ఏళ్ల వయసు మాత్రమేనట. ఈ నేపథ్యంలోనే మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆ షెడ్యూల్ కు సంబంధించిన రషెస్ చూసిన తర్వాత ఆయన సినిమాటోగ్రాఫర్ ను పిలిచి ఆయనకు సపరేట్గా ఒక క్లాస్ తీసుకున్నాడట. తన పక్కన కనుక సదరు హీరోయిన్ ఉంటే ఆ ఫ్రేమ్లో స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్ వాడి తన వయసు కనపడకుండా చేయమని సినిమాటోగ్రాఫర్ ను హీరో కోరారట.

తల నొప్పి ఉండదు కదా
సదరు హీరోయిన్ తో కలిసి ఉన్నప్పుడు వీరిద్దరి జంట బాగోలేదని ప్రేక్షకుల కనిపించకూడదని ఆయన తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా కెమెరా జిమ్మిక్కులతో వయసు తక్కువ చూపించుకోవడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. కానీ హీరోయిన్స్ ఎంపిక చేసుకునే సమయంలో తన వయసుకు తగ్గ హీరోయిన్లను ఎంపిక చేసుకుంటే ఈ తల నొప్పి ఉండదు కదా అని అంటున్నారు విశ్లేషకులు.

వయసు తగ్గట్లుగానే
మరీ తన వయసులో ఉండే హీరోయిన్లు అంటే ఎవరూ ఉండరు కాబట్టి కనీసం 30 దాటిన హీరోయిన్లను తీసుకున్నా సరే ఆయనకు ఈ టెన్షన్ అయితే ఉండదు కదా అని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో కొంతమంది బడా హీరోలు తమ వయసు తగ్గట్లుగానే 30 పైబడిన హీరోయిన్లుగా ఎంచుకుని ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా షూటింగులు కానిస్తున్నారు. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో మాత్రం కుర్ర హీరోయిన్ ని పెట్టుకుని ఇప్పుడు టెన్షన్ తో షూటింగ్ జరపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











