సమస్యల్లో డైరెక్టర్ శ్రీను వైట్ల దాంపత్యం.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య!

ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమంలో ప్రముఖ సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారుతోంది. రాబోయే రోజుల్లో మరి కొంతమంది కూడా వారి బాంధవ్య జీవితం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లుగా ఒక గట్టి టాక్ అయితే వినిపిస్తోంది. రీసెంట్ గా మరొక సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల, ఆయన భార్య విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శ్రీను వైట్ల భార్య ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఆయన పేరు డైరెక్ట్ గానే కొంతమంది చెప్పేస్తున్నారు. ఇక వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయంపై కూడా ఒక టాక్ వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

విడాకులతో షాక్

విడాకులతో షాక్

సినిమా పరిశ్రమలో ప్రేమ తో పెళ్లి వరకు వెళ్లిన జంటలు చాలా తక్కువగానే ఉన్నాయి. చాలావరకు ప్రేమతోనే బ్రేకప్ చెప్పిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం వారి అన్యోన్యమైన దాంపత్య జీవితంతో చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి కొందరు మాత్రం చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు చేసుకుంటూ ఒక విధంగా షాక్ ఇస్తున్నారు అని చెప్పాలి.

మళ్ళీ కలవాలని

మళ్ళీ కలవాలని

తమిళ చిత్ర పరిశ్రమంలో ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ విడిపోవడం ఒక విధంగా వారి అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. అలాగే టాలీవుడ్ చిత్రపరిశ్రమంలో నాగచైతన్య సమంత ఇద్దరు కూడా దంపత్య జీవితానికి ముగింపు పిలవడం కూడా అభిమానులు తట్టుకోలేకపోయారు. మళ్ళీ వాళ్ళు కలవాలి అని సోషల్ మీడియాలో కొన్ని టాక్స్ కూడా ట్రెండ్ చేశారు. కానీ స్టార్స్ మాత్రం వారి వ్యక్తిగత జీవితంలో ఎవరి నిర్ణయాలు తీసుకోకుండా సంతోషంగానే విడిపోయినట్లుగా తెలుస్తోంది.

మరో దర్శకుడు కూడా..

మరో దర్శకుడు కూడా..

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మరొక ప్రముఖ దర్శకుడు కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ దర్శకుడికి సంబంధించిన ఫోటోలు పేర్లు కూడా వైరల్ గానే మారుతున్నాయి. అసలైతే గత ఏడాదిలోనే వారు విడిపోవాలని అనుకున్నారట. ఇక ఇప్పుడు విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది.

ఫామ్ కోల్పోయిన కామెడీ డైరెక్టర్

ఫామ్ కోల్పోయిన కామెడీ డైరెక్టర్


కామెడీ దర్శకుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ సూపర్ స్టార్ లతో అలాగే మరి కొంతమంది అగ్ర హీరోలతో కూడా అతను సినిమాలు చేశాడు. ఎక్కువగా కామెడీ లవ్ స్టోరీలతోనే మంచి గుర్తింపు అందుకున్న ఆదర్శకుడు కి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు అయితే ఉంది. కానీ వరుస అపజయల వలన ఇటీవల కాలంలో అతను ఫామ్ కోల్పోయాడు.

 భార్య కారణంగా డిప్రెషన్

భార్య కారణంగా డిప్రెషన్


ఇక ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మళ్ళీ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమాలు పట్టాలు ఎక్కలేక పోయాయి. స్క్రిప్ట్ వర్కౌట్ కాకపోవడంతోనే అతను కాస్త అప్సెట్ అయినట్లు సమాచారం. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా తన భార్యతోనే వివాదాల కారణంగా దర్శకుడు మరింత డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

భార్య నుంచి సపోర్ట్ లేకపోవడంతో..

భార్య నుంచి సపోర్ట్ లేకపోవడంతో..


అసలే పరాజయాల్లో ఉన్న ఆదర్శకుడు భార్య తీరును చూసి ఏమాత్రం ప్రశాంతంగా లేడు అనే టాక్ వస్తోంది. ఇలాంటి కఠిన సమయంలో భార్య నుంచి మద్దతు లేకపోవడంతో అతను తీవ్రంగా నిరాశ చెందాడట. ఇక విడాకులు తీసుకోవడం బెటర్ అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నప్పటికీ ఈ విషయంలో పెద్దలు కూడా చర్చలు జరిపినప్పటికీ వినడం లేదట. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X