రానని మొండికేస్తున్న స్టార్స్.. నిర్మాతలకు కొత్త తలనొప్పులు

అసలే కరోనా దెబ్బకు రెండు నెలలు అంతా మూలన పడింది. నిర్మాణంలో ఉన్నవి అర్దాంతరంగా ఆగిపోయాయి. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని ఉన్న చిత్రాలరిలీజ్‌కు మోక్షం ఎప్పుడు వస్తుందో తెలిసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో సినీ పెద్దలు ప్రభుత్వాలతో కలిసి మాట్లాడటం, కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగిన సంగతి తెలిసిందే.

ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకునేందుకు కొన్ని మినహాయింపులు ఇచ్చిన విషయం విదితమే. అయితే ఇన్ డోర్ షూటింగ్స్, తక్కువ మొత్తంలో యూనిట్ సభ్యులు హాజరై తీసే సీన్స్‌ను షూట్ చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే కొందరు స్టార్స్ మాత్రం బయటకు రావడానికి తెగ భయపడిపోతున్నారట.

రెండు నెలలుగా ఖాళీ..

రెండు నెలలుగా ఖాళీ..

లాక్ డౌన్ కారణంగా చిత్రసీమ మొత్తం కుదేలైపోయింది. రెండు నెలలుగా ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో ఎంతో మంది ఉపాధిని కోల్పో్యారు. అప్పులు తెచ్చి నిర్మాణంలో పెట్టిన నిర్మాతలు వడ్డీలు కట్టలేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో ఆశలు చిగురించాయి.

సినీ పెద్దల భేటీ..

సినీ పెద్దల భేటీ..

రాష్ట్ర ప్రభుత్వాలతో సినీ పెద్దలంతా భేటీ అయి.. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి.. షూటింగ్స్ ఎలా చేయాలి? థియేటర్స్ పున: ప్రారంభించడంపై నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిపై చర్చించారు. ప్రస్తుతానికి షూటింగ్‌కు మాత్రం అనుమతులు లభించాయి.

మొదలైన పనులు..

మొదలైన పనులు..

అయితే ఇప్పటికే డబ్బింగ్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. సెట్‌లోకి హీరో హీరోయిన్లు రావడం వంటివేమీ ప్రారంభం కాలేదు. అయితే వీటిపై ఇండస్ట్రీలో ఇంకో రకమైన టాక్ నడుస్తోంది. ఇప్పట్లో షూటింగ్‌లకు రాలేమని స్టార్ హీరో, హీరోయిన్లు తెగేసి చెబుతున్నారట.

తప్పుకోవడానికైనా సిద్దమే..

తప్పుకోవడానికైనా సిద్దమే..

స్టార్ హీరోయిన్‌లు కూడా ఇలాంటి మాటలే చెప్పడంతో సదరు నిర్మాతలు ఖంగుతిన్నారట. కావాలంటే తన స్థానంలో వేరే ఎవరినైనా తీసుకోండని నిర్మోహమాటంగా చెబుతున్నారట. కొందరు స్టార్ హీరోలైతే ఇప్పుడే షూటింగ్స్ వద్దని నిర్మాతలకు సూచిస్తున్నారట. ఈ లెక్కన ఇప్పట్లో షూటింగ్స్ మొదలు కావడం గగనమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X