అమెరికాలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌పై దాడి?

అమెరికా తెలుగు సంఘం(తానా) 22 మహా సభలు వాషింగ్టన్ డిసీలో జులై 4 నుంచి 6 వరకు గ్రాండ్‌గా జరిగాయి. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్లు ఈ సభల్లో సందడి చేశారు. తమ ఆట పాటలతో అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులకు వినోదం పంచారు.

అయితే 'తానా' ఈవెంట్ ముగిసిన తర్వాత కొన్ని ఊహించని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో బాగా వైరల్ అవుతున్న న్యూస్... తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ కమెడియన్ మీద అమెరికాలో దాడి జరిగిన అంశం. దాడి ఎందుకు జరిగింది అనే అంశం ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సన్మానం జరిగిన అనంతరం జరిగిన పార్టీలో...

సన్మానం జరిగిన అనంతరం జరిగిన పార్టీలో...

‘తానా' సభల్లో పాల్గొన్న అనంతరం సదరు కమెడియన్‌కు నిర్వాహకులు సన్మానం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమెరికాలోని మరో తెలుగు సంస్థ సదరు కమెడియన్‌కు తమ ఆర్గనైజేషన్ తరుపున సన్మానం చేసేందుకు తీసుకెళ్లారట. సన్మానం అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

దాడికి గల కారణం ఏమిటి?

దాడికి గల కారణం ఏమిటి?

దాడికి గల కారణం ఏమిటనే విషయం ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాగిన మత్తులో సదరు కమెడియన్.... అక్కడ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో పెద్ద గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఆ మహిళకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ దాడి చేసినట్లుగా చర్చించుకుంటున్నారు.

పోలీసులకు కంప్లయింట్ చేద్దామనుకున్నారు కానీ...

పోలీసులకు కంప్లయింట్ చేద్దామనుకున్నారు కానీ...

సదరు కమెడియన్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళకు చెందిన కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని, అదే జరిగితే సదరు కమెడియన్ ఇబ్బందుల్లో పడటంతో పాటు అతడికి అక్కడికి తీసుకొచ్చిన సంస్థకు కూడా చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో.... విషయం అంతదూరం వెళ్లకుండా ఆపారట.

కమెడియన్ గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్

కమెడియన్ గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్

ఇలాంటి విషయాలు మనుషుల కంటే వేగంగా దేశాలు దాటుతాయి. సదరు కమెడియన్ అమెరికా నుంచి ఇండియా వచ్చే లోపే తెలుగు సినిమా పరిశ్రమలో ఈ విషయం స్ప్రెడ్ అయింది. అయితే అతడో స్టార్ కమెడియన్ కావడంతో అతడి పేరు బహిరంగంగా మాట్లాడటానికి, చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X