Allu Arjun తమిళ హీరో కలయికలో మల్టీస్టారర్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బిగ్గెస్ట్ ప్లాన్?

గత కొంత కాలంగా స్టార్ దర్శకులు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి ముందు వరకు కూడా పాన్ ఇండియా సినిమాలకు అంతగా మార్కెట్ లేకపోవడంతో స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నిర్మాతలు కూడా అంతగా ధైర్యం చూపలేదు. అంతేకాకుండా హీరోల మధ్య ఎలాంటి అభిప్రాయాలు వచ్చినా కూడా మళ్లీ ఆ తర్వాత కష్టమవుతుందని రిస్క్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు హీరోలు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండటం అలాగే నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ జీవం పోసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ ధనుష్ కాంబినేషన్ పై కూడా ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఒక టాలీవుడ్ స్టార్ దర్శకుడు అందుకు సంబంధించిన ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే..

ట్రెండ్ సెట్ చేయబోతున్న RRR

ట్రెండ్ సెట్ చేయబోతున్న RRR

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాలో రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న RRR సినిమా మరికొన్ని రోజుల్లో ఒక ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమవుతోంది.

మారిన ఆలోచనలు

మారిన ఆలోచనలు

మల్టీస్టారర్ సినిమాలు చేయడం చాలా కష్టమని అనుకుంటున్న తరుణంలో దర్శకుడు రాజమౌళి RRR సినిమాను తెరపైకి తీసుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో మళ్లీ అలాంటి సినిమాలు మరిన్ని రావాలని మిగతా హీరోల అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక స్టార్ దర్శకులకు కూడా ఒక నమ్మకం అయితే ఏర్పడింది. మంచి కథతో వస్తే ఇప్పుడున్న హీరోలు ఎలాంటి బేధాలు లేకుండా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటారని అర్థమవుతుంది.

మల్టీస్టారర్ సినిమాలో అల్లు అర్జున్

మల్టీస్టారర్ సినిమాలో అల్లు అర్జున్

ఇక ఇటీవల పుష్ప సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ అలాగే మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అతని కోసం కొంత మంది బాలీవుడ్ దర్శకులు కూడా ఎదురుచూస్తున్నారు

కొరటాల శివ దర్శకత్వంలో

కొరటాల శివ దర్శకత్వంలో


ఇక అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఇదే చేయాల్సి ఉంది. కొరటాల శివ గతేడాది బన్నీతో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ఆగిపోయింది. ఇక కొరటాల శివ మళ్లీ ఎన్టీఆర్ తో బిజీ కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కొరటాల శివ అల్లుఅర్జున్ తో మల్టీస్టారర్ కథను రూపొందించె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Allu Arjun’s Pushpa Registers Massive TRP Ratings | Filmibeat Telugu
పర్ఫెక్ట్ మల్టీస్టారర్

పర్ఫెక్ట్ మల్టీస్టారర్

దర్శకుడు కొరటాల శివ తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరొక హీరోను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న ధనుష్ ఇదివరకే బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. అల్లు అర్జున్ ధనుష్ కాంబినేషన్ కలిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు. అన్ని భాషలలో ఈ ఇద్దరి హీరోలకు మంచి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా పర్ఫెక్ట్ మల్టీస్టారర్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X