మెగాస్టార్ చిరంజీవినే క్యూలో నిల్చోబెట్టిన స్టార్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.... ఈ పేరు తెలియని భారతీయ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఆయనది ఏ సినిమా వచ్చినా థియేటర్ల వద్దకు వెళ్లి క్యూలు కడుతున్నారు. ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. అద్భుతమైన కథలను ఎంచుకోవడం.. అదే స్థాయికి చెందిన డైరెక్టర్లను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఈక్రమంలోనే చిరంజీవి ఓ అద్భుతమైన కథను తీసుకెళ్లి డైరెక్టర్ శైలేష్ కొలనును కలిశాడట. అయితే ఆ కథ చూడకుండానే శైలేష్ కొలను... ఈ సినిమాను ఆపేశాడు. తాను ఆ కథను తీయలేనని.. కూడా చాలా సున్నితంగా చెప్పాడట. తాను తీసిన ఓ రాసుకున్న కథతోనే చిరును డైరెక్ట్ చేయాలనుకుంటున్నట్లు కూడా వివరించాడు. తన ఓన్ స్క్రిప్టుతోనే చిరును చూపించాలని... అలా అయితేనే తనకు సినిమా చేసిన ఫీల్ ఉంటుందని కూడా చెప్పాడట. చిరు ఆఫర్ చేసినా శైలేష్ కొలను సున్నితంగా తిరస్కరించడంతో అంతా ఆయన రిజెక్ట్ చేశారని అనుకున్నారు.

కానీ శైలేష్ కొలను మాత్రం ఆ కథ వద్దు అనుకున్నాడే తప్ప చిరుతో సినిమా తీయాలనే ఆలోచనను మాత్రం మానుకోలేదు. ఆయన కోసం తానే కొత్తగా ఓ కథ రాస్తానని పేర్కొన్నాడట. ముఖ్యంగా ఆయన తన సొంత కథలతోనే సినిమాలు తీస్తాడు. ఎవరు ఎంత మంచి కథలు చెప్పినా దాన్ని మలిచి సినిమాలు తీసే ప్రయత్నం కూడా చేయడు. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వేరే వాల్లు రాసిన కథలను సినిమాలుగా మలుస్తుంటారు. కానీ శైలేష్ కొలను మాత్రం వీరికి చాలా భిన్నం. తాను రాసిన కథలతోనే చిత్రాలను తీస్తుంటారు. వాటిని బ్లాక్ బస్టర్ హిట్లుగా మలుస్తుంటారు.
శైలేష్ కొలను తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది యంగ్ డైరెక్టర్లకు స్ఫూర్తిదాయకం. ఇలా చేయడం వల్ల చాలా సినిమాలు అందులోని ప్యూరిటీని మిస్ అవుతాయి. ఓ డైరెక్టర్ ఊహించుకుని రాసిన కథకు.. కరెక్టుగా ఎవరు సెట్ అవుతారు, ఎలా చేయించాలనేది కేవలం డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. కానీ ఆ కథను వేరే వాళ్లు తీసుకుని తమకు నచ్చినట్లుగా సినిమాను మలచడం అనేది చాలా కష్టం. దీని వల్లే ఎక్కువగా రీమేక్ చిత్రాలు ఫ్లాప్ లుగా నిలుస్తుంటాయి.

అలా చేయకూడదనే, ఫ్లాప్ గా నిలవకూడదనే ఉద్దేశంతోనే డైరెక్టర్ శేలేష్ కొలను వేరే వాళ్ల కథలను సినిమాలుగా మలచరు. కానీ చిరు చేసిన ఆఫర్ ను మాత్రం క్యూలో పెట్టారని.. త్వరలోనే కథ రాసుకుని ఆయనతో సినిమా చేస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











