NTR30: ఎన్టీఆర్‌కు సినిమాలో మరో విలన్.. షాకివ్వబోతున్న తెలుగు స్టార్.. సినిమాలో అసలైన ట్విస్ట్ అదే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా అతడు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తనదైన శైలిలో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు. అలాగే, వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే RRR మూవీతో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు కొరటాల శివతో సినిమాను చేస్తోన్నాడు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

అంతర్జాతీయ స్థాయికి
వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న జూనియర్ ఎన్టీఆర్.. గత ఏడాది RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని కూడా తీసుకు వచ్చింది.

కొరటాల శివతో ప్రాజెక్ట్
RRR సినిమా షూట్ జరుగుతోన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ఆపేశారు. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇస్తున్నాడు.

ఆరోజే పూజా ఈవెంట్
'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినా చిత్రీకరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఫిబ్రవరి 24న మొదలు పెట్టాలనుకున్నా తారకరత్న మరణంతో వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 18న పూజా ఈవెంట్ చేయనున్నారు.

జాన్వీ ఫిక్స్.. భారీగానే
క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ముఖ్యంగా ఇందులో నటించే నటీనటుల గురించి చాలా రకాల ప్రచారాలు జరిగాయి. ఇక, ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నారు. ఈ చిత్రం కోసం ఆమెకు ఏకంగా రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్‌గా చేస్తున్నారని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

విలన్‌గా ఆ స్టార్ హీరో
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల ఆయనకు స్టోరీని వినిపించారని, వెంటనే సైఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఆ తెలుగు హీరో కూడా
పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్లను భాగం చేయాలని దర్శకుడు కొరటాల భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం వేరే ఇండస్ట్రీలకు చెందిన వారిని తీసుకున్నారని కూడా అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ తెలుగు స్టార్ హీరో నెగెటివ్ రోల్‌ను చేస్తున్నట్లు తాజాగా తెలిసింది.

అసలైన ట్విస్ట్ అదే
భారీ బడ్జెట్‌తో మాస్ యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాలో సైఫ్ ప్రతినాయకుడిగా కనిపిస్తారట. అయితే, తెలుగు హీరో కూడా ఇందులో విలన్‌గా చేస్తున్నాడని తెలిసింది. అతడి గురించి తెలిసిన సీన్ సినిమా కథనే మలుపు తిప్పే ట్విస్ట్ అవబోతుందని తెలిసింది. ఆ హీరో ఎన్టీఆర్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తాడని టాక్. అయితే, ఆ స్టార్ ఎవరో మాత్రం తెలియలేదు.


Click it and Unblock the Notifications











