Sarkaru Vaari Paata కథ మహేష్ కంటే ముందు ఆ హీరో కోసం.. అలా క్యాన్సిల్ అవ్వడంతో..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ నెలలో విడుదలవుతున్న అతిపెద్ద బిగ్ బడ్జెట్ మూవీ సర్కారు వారి పాట. గత ఏడాది నుంచి సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఉరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు శుక్రవారం రోజు భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ లో చాలా బిజీగా ఉన్నారు. అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే సర్కారు వారి పాట సినిమా కథను మొదట ఎవరి కోసం అనుకున్నారు అనే విషయంలో కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్నట్లు ఇండస్ట్రీలో ఒక గట్టిగానే వినిపిస్తోంది. అసలు ముందు దర్శకుడు ఈ కథను ఎవరి కోసం అనుకున్నాడు? ఎవరికి చెప్పాడు మొదట? చెప్పిన హీరో ఎందుకు చేయలేదు అనే వివరాల్లోకి వెళితే..

పదేళ్ళ నుంచి..

పదేళ్ళ నుంచి..

దర్శకుడు పరశురామ్ గీతగోవిందం సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతనికి బడా నిర్మాణ సంస్థల నుంచి కూడా ఆఫర్లు చాలానే వచ్చాయి. అసలైతే గీత గోవిందం సినిమా కంటే ముందు పదేళ్ల నుంచి ఈ దర్శకుడు గీతాఆర్ట్స్ సంస్థలోనే ఉంటూ కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అల్లు శిరీష్ తో చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

 ఆ కృతజ్ఞతతోనే..

ఆ కృతజ్ఞతతోనే..

అయితే ఆ తర్వాత మిగతా వారి నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ పరశురామ్ మళ్ళీ గీతా సంస్థతో సినిమా చేసేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకంటే పరశురామ్ అవకాశాలు లేకుండా ఉన్నప్పుడు నిర్మాత అల్లు అరవింద్ మద్దతుగా ఉన్నాడు. ఆ కృతజ్ఞతతోనే గీత గోవిందం వరకు పరుశురాం కొనసాగటం జరిగింది. అయితే సర్కారు వారి పాట సినిమాను కూడా మొదట గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది.

అల్లు అర్జున్ కోసం..

అల్లు అర్జున్ కోసం..

ఇక మహేష్ కారణంగా ఆ ప్రాజెక్టు మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించారని వార్తలు వచ్చాయి. అయితే మొదట సర్కారు వారి పాట కథ చర్చలు గీత ఆర్ట్స్ లో జరిగినప్పుడు మొదట ఈ సినిమా కథను అల్లు అర్జున్ కోసమే అనుకున్నారట. గీత గోవిందం సినిమా తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు పరశురామ్ తో ఒక సినిమా చేయాలి అనే ఆలోచన కూడా వచ్చాడు.

అందుకే క్యాన్సిల్..?

అందుకే క్యాన్సిల్..?

అయితే అందుకు నిర్మాత అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ సర్కారు వారి పాట సినిమా బాగానే ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అప్పుడు పుష్ప సినిమా ఆలోచనలో ఉండడం వలన పాన్ ఇండియా రేంజ్ లో కొనసాగాలని ప్రస్తుతానికి ఆ కథను చేయలేను అని చెప్పేశాడట.

మహేష్ బాబు కోసం..?

మహేష్ బాబు కోసం..?

కానీ అదే ఐడియా మహేష్ బాబుకు చెప్పడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ కథను మహేష్ బాబు కోసమే రాసుకున్నట్లు చాలా బలంగా చెబుతున్నాడు. కానీ మరొక టాక్ ప్రకారం అయితే ముందుగా ఈ సినిమా స్టోరీ ఐడియా బన్నీ కోసం అనుకున్నారు అని అతనితో సెట్ అవ్వకపోవడం తో మళ్లీ మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ చేంజ్ చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి మహేష్ బాబు ఎంతో ఇష్టంగా చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X