విజయ్ దేవరకొండ హిట్ సినిమాకు సీక్వెల్.. అదే కాంబినేషన్ లో బిగ్ ప్లాన్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన కెరీర్ రేంజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. గత ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా దేవరకొండ రేంజ్ కాస్త కూడా తగ్గలేదు అని చెప్పవచ్చు.

ఎందుకంటే అతని సినిమాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. శివ నిర్వణ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాలో సమంత కథనాయకగా నటిస్తోంది. ఆ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల కానుంది. ఇక ఆ సినిమా అనంతరం విజయ్ వెంటనే మరొక సినిమాను కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.

Tollywood star hero vijay devarakonda Geetha Govindam movie sequel plans

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ గీతగోవిందం సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పరశురాం దర్శకత్వంలో 2018 లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ దర్శకుడు అదే కథకు సీక్వెల్ రెడీ చేస్తూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ దేవరకొండకు నిర్మాత అల్లు అరవింద్ కు ఆ కథకు సంబంధించిన స్టోరీ లైన్ గురించి కూడా చెప్పారట.

Tollywood star hero vijay devarakonda Geetha Govindam movie sequel plans

అది నచ్చడంతో విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పూర్తిస్థాయిలో కథ సిద్ధమైన తర్వాత ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఒక క్లారిటీ రానుంది. ఇక విజయ్ దేవరకొండ మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ కరణ్ జోహార్ ప్రొడక్షన్లో కూడా రెండు సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X