‘స్టార్ హీరో’ల సకుటుంబ సపరివార చిత్రాలు త్వరలో...
ప్రస్తుతం ఒక్క హీరో చేసే చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులకు రుచింపడం లేదు. మల్టీస్టార్రర్ మూవీస్ కావాలని కోరుకుంటున్నారు..వేదం చిత్రంతో కొద్దిగా ఆరుచి అందించాలని చూసినా అది పూర్తి స్థాయిలో అందించడంలో దర్శకుడు విఫలం అయ్యాడని అందుకే ఆ చిత్రానికి కలెక్షన్స్ తగ్గాయని ఫిల్మ్ నగర్ టాక్. అయితే త్వరలో పరిశ్రమను, ప్రేక్షకులను ఆనందంలో ముంచేయడానికి మల్టీస్టారర్ చిత్రాలు రానున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. అందులో సకుటుంబ సపరివార సమేతంగా రానున్న ఆ చిత్రాలు ఏమిటో ఒక సారి పరిశీలిస్తే..
అక్కినేనే నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు ఒకే చిత్రంలో కలిసి నటించనున్నారని..ఈ చిత్రాన్ని..టి. సుబ్బిరామిరెడ్డి నిర్మించడానికి సుముఖంగా ఉన్నారని విశేషవర్గాల సమాచారం. వీరంతా రొమాంటిక్ వీరులు కావడంతో చిత్రం కూడా రొమాంటిక్ గానే ఉంటుందని సమాచారం. మరో మల్టీస్టారర్ చిత్రం మెగా ఫ్యామిలీ నుండి ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ తో పాటు అల్లు అర్జున్ కూడా ప్రధానపాత్రలో నటించనున్నాడని సమాచారం వీరి కాంబినేషన్ లో చిత్రం కోసం కథ చర్చలు జరుగుతున్నాయని వినికిడి. ఇది మాస్ మసాలా మూవీ అని సమాచారం.
అలాగే తర్వాత రాబోయే చిత్రం నందమూరి వంశం నుండి బాలయ్యతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లతో పాటు హరికృష్ణ, తారకరత్నలు కూడా నటించనున్నారని ఈ చిత్రం కూడా నందమూరి సొంత బ్యానర్ లో రూపుదిద్దుకుంటుందని వార్తలు వస్తున్నాయి.బహుశా..ఇది పౌరాణిక చిత్రం కావచ్చు.
తర్వాత కాంబినేషన్ వెంకీ, రాణాలది..వీరిద్దరు మంచి కథ దొరికితే ఎప్పటినుంచో చిత్రం చేయాలనే ప్లాన్ లో ఉన్నారు..వీరిద్దరు కాకుండా వెంకీ తన చెల్లెలు కొడుకు నాగచైతన్యతో కూడా కలిసి చేయడానికి ఇష్టపడుతున్నాడట. ఇది లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ అని సమాచారం. వీరందరూ కలిసి నటించే చిత్రాల కోసం కథాన్వేషణలు జరుగుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











