For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR మూవీలో ప్రభాస్: సీనియర్ హీరోలను కూడా వాడుతూ.. ముందే లీకైన రాజమౌళి మాస్టర్ ప్లాన్

  |

  తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). 'బాహుబలి'తో టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఎన్నో సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ వీడియో రిలీజ్ కాబోతుంది. దాని గురించి ఇప్పుడో న్యూస్ వైరల్ అవుతోంది. ఆ సంగతులు మీకోసం!

  విప్లవ వీరుల్లా మారిన స్టార్ హీరోలు

  విప్లవ వీరుల్లా మారిన స్టార్ హీరోలు

  స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి.. వీర మరణం పొందిన తెలుగు వాళ్లు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో తారక్.. భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

  రామ్ చరణ్‌ మూవీపై శంకర్ యూటర్న్: ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఎందుకిలా చేస్తున్నారబ్బా!

   ఎన్నో బ్రేకులు... షూటింగ్ అప్‌డేట్

  ఎన్నో బ్రేకులు... షూటింగ్ అప్‌డేట్

  RRR మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనికి కారణం వరుస ఆటంకాలు ఎదురవడమే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఈ మధ్యనే చాలా వరకూ పూర్తి చేశారు. ఇక, ఇప్పుడు రెండు పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. వాటికి కూడా షెడ్యూళ్లను రెడీ చేసుకుంటోంది చిత్ర యూనిట్.

   ఈ సారి మారేది లేదు... ఫిక్స్ చేసే

  ఈ సారి మారేది లేదు... ఫిక్స్ చేసే

  RRR మూవీ 2020లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందు నుంచే చేసుకుంటున్నారు.

   పక్కా ప్లాన్‌.. కొద్ది రోజుల్లోనే కంప్లీట్

  పక్కా ప్లాన్‌.. కొద్ది రోజుల్లోనే కంప్లీట్

  RRR మూవీ బ్యాలెన్స్ షూట్‌కు సంబంధించి.. రెండు పాటలు మిగిలి ఉన్నాయి. అందులో ఓ పాట కోసం ఎన్టీఆర్.. ఒలీవియా ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో హీరోలిద్దరితో పాటు ఆలియా భట్‌తో మరో పాట తీస్తారు. దీని కోసం దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌ను ప్లాన్ చేశారు. ఇది పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలెట్టడానికి రెడీ అవుతారు.

  ఫ్రెండ్‌షిప్‌ డేకు ప్రమోషనల్ సాంగ్‌తో

  ఫ్రెండ్‌షిప్‌ డేకు ప్రమోషనల్ సాంగ్‌తో

  తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులూ RRR మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే దీన్ని మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా చేయడానికి రాజమౌళి.. RRR మూవీ నుంచి ఫ్రెండ్‌షిప్‌డేన ఓ ప్రమోషనల్ సాంగ్‌ను వదలబోతున్నాడు.

  రెచ్చిపోతున్న శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్: సినిమాల్లోకి రాకముందే ఓ రేంజ్‌లో అందాల ఆరబోత

  RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
   ముందే లీకైన రాజమౌళి మాస్టర్ ప్లాన్

  ముందే లీకైన రాజమౌళి మాస్టర్ ప్లాన్

  RRR మూవీ ప్రమోషనల్ సాంగ్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఆ పాటను కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ఆలపించబోతున్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో ఇద్దరు హీరోలు, చిత్ర యూనిట్‌తో పాటు గతంలో రాజమౌళి సినిమాల్లో పని చేసిన ప్రభాస్, రానా, రవితేజ, నితిన్, సునీల్, నానిలను కూడా చూపించబోతున్నాడని ఓ న్యూస్ ఇటీవలే లీకైన విషయం తెలిసిందే.

  సీనియర్ హీరోలను కూడా వాడుతూ

  సీనియర్ హీరోలను కూడా వాడుతూ

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. RRR మూవీ ప్రమోషనల్ సాంగ్‌లో రాజమౌళి హీరోలతో పాటు మరికొందరు కూడా కనిపించబోతున్నారట. వాళ్లే టాలీవుడ్‌కు చెందిన సీనియర్ స్టార్లు. ప్రత్యక్షంగా వీళ్లు ఈ పాటలో లేకపోయినా.. వీళ్లకు సంబంధించిన పిక్స్‌ను ఇందులో చూపించబోతున్నారట. స్నేహానికి విలువనిచ్చే ఈ పాటలో వాళ్లంతా కనువిందు చేయనున్నారని సమాచారం.

  English summary
  Tollywood Most Anticipated Movie RRR. This Movie Promotional Song Will Be Release on Friendship Day Special. Tollywood Star Heroes Part In This Song.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X