‘మగధీర’ ను టార్గెట్ గా పెట్టుకొని అష్టకష్టాలు పడుతున్న నెం.1 హీరోలు..
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో విడుదల అయిన చిత్రం 'వేదం". ఈ చిత్రానికి బన్నీ కేబుల్ వైర్లు వేసుకుని చిత్రం విడుదలకు ముందు చాలా హడావుడి చేశాడు. కానీ చిత్రం విడుదల తర్వాత ఎక్కడా చిత్ర ప్రమోషన్ లో పాల్గొనలేదు. అలాగే 13న జరిగిన టాలీవుడ్ ట్రోపీలో స్వయంగా చిరంజీవి టీమ్ లో ఎన్నికైనా..అసలు అక్కడకు రాకుండా ముందుగానే అవుట్ అయ్యాడు. మరి ఎందుకు డుమ్మకొంట్టాడు అని విచారిస్తే ఇప్పుడు అవుట్ అవుతున్నది రేపు కప్పు పట్టుకోవడానికే అంటూ సమాధానం ఇస్తున్నాడు. అలాగే మహేష్ బాబు తన ట్విట్టర్ లో మగధీర ను టార్గెట్ చేసుకొనే ఎప్పుడు లేనంతగా తన సినిమా 'కలేజా" గురించి చాలా హైప్ ఇచ్చాడు.
ప్రస్తుతం అతని టార్గెట్ క్రికెట్ కాదు..వేదం కాదు..రామ్ చరణ్ నటించిన 'మగధీర". ఇప్పటికే అతన్ని నెంబర్ వన్ హీరోల లిస్ట్ నుండి ఒక స్టెప్ ప్రక్కకు పడింది. అయితే చరణ్ లా ఒకే ఒక్క సినిమాతో లిస్ట్ లో కాదు..ఆ స్థానాన్నే తన్నుకుపోవాలనుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం చేస్తున్న చిత్రంకోసం బాగా కష్టపడుతున్నాడట. అంతే కాదు..'మగధీర" చిత్రం తనతో చేయకుండా చరణ్ తో చేసినందుకు తన తండ్రిపై కూడా బన్నీ..కోపంగా ఉన్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కొడుకు ఆగ్రహానికి అల్లు అరవింద్ 'బద్రీనాథ్" కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతాను..సినిమా మాత్రం బంఫర్ హిట్ అవ్వాలని వినాయక్ కి సూచిస్తున్నాడట.
రామ్ చరణ్ నటించిన రెండవ చిత్రం 'మగధీర" రికార్డులు తిరగరాయటంతో ప్రతి ఒక్క స్టార్ హీరోలో అలాంటి సినిమా చేయాలనే తపన, మరియు ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని, అదే టార్గెట్ గా పెట్టుకొని ప్రతి ఒక్క హీరో ప్రస్తుతం వారు చేస్తున్న షూటింగ్స్ల్ లో అష్టకష్టాలు పడుతున్నారు. జూ ఎన్టీఆర్, 'శక్తి", 'బృందావనం", పవన్ కళ్యాణ్, 'కొమరం పులి", మహేష్ బాబు 'కలేజా", అల్లు అర్జున్'బధ్రీనాథ్" మరియు వీరిలో ఎవరు ఆ రికార్డులను గెలుచుకుంటారో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











