అతడి ప్రేమలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్... పెళ్లికి కూడా రెడీ?

ఈ మధ్యకాలంలో ప్రేమ వివాహాలు చాలా కామన్ అయిపోయాయి. కేవలం సాధారణ ప్రజల్లోనే కాదు.. సెలబ్రిటీలలో కూడా ఈ ప్రేమ వ్యవహారాల ట్రెండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే ఆసక్తికరంగా తెలుగులో లీడింగ్ హీరోయిన్ గా ప్రస్తుతం టాప్ రేసులో దూసుకుపోతున్న ఒక భామ తన చిన్ననాటి ఫ్రెండ్ తో ప్రేమలో పడిందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

స్టార్ హీరోయిన్ క్రేజ్: నిజానికి ఆమె తెలుగులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక చిన్న సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె చేసిన సినిమాలు మొదట్లో సూపర్ హిట్ కావడంతో ఇప్పటికీ ఆమెను బుక్ చేసుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ఆమె రెమ్యూనరేషన్ కూడా ఎవరు ఊహించని రీతిలో పెరిగిపోయింది. అయితే అలాంటి భామ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు కారణమైంది.

Tollywood star heroine fell in love news viral in social media

క్లాస్ మేట్ తో ప్రేమ: అసలు విషయం ఏమిటంటే ఆమె తన క్లాస్ మేట్ ఒకరితో ప్రేమలో ఉందని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఆ ప్రేమ కారణాల వెనుక నిజం ఉన్నదో లేదో తెలియదు.. కానీ ఆమె తన క్లాస్ మేట్ తో మాత్రం పీకల్లోతు ప్రేమలో ఉందని డబ్బు, అంతస్తు కాదు.. మంచి మనసు ముఖ్యమని భావించి ఆమె అతని ప్రేమలో మునిగితేలుతోందనే ప్రచారం జరుగుతోంది.

చేతినిండా ఆఫర్లు: వాస్తవానికి ఆమెకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. బడా హీరోల పక్కన కూడా ఆమెకు నటించే అవకాశాలు దక్కుతున్నాయి. పెద్దపెద్ద హీరోల పక్కన నటిస్తున్న ఆమె మాత్రం తన ప్రేమ విషయంలో నిజాయితీగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది . ఆ కుర్రాడు కూడా బాగా సెట్ అయిన డాక్టర్ అని ఆస్తిపాస్తులు లేకపోయినా మంచివాడని అంటున్నారు. ఉద్యోగం ఉంది కాబట్టి.. తన తల్లి దగ్గరకు కూడా ఈ విషయం హీరోయిన్ తీసుకువెళ్లడం ఆమె ఒప్పుకోవడం కూడా జరిగిపోయిందనే టాపిక్ వినిపిస్తోంది.

Tollywood star heroine fell in love news viral in social media

ప్రియుడితో పెళ్లి: అయితే ఇప్పుడు కెరీర్ మంచి ఫామ్ లో ఉంది. కాబట్టి ఫామ్ లో ఉన్నంతవరకు నాలుగు రాళ్లు వెనకేసుకొమని తల్లి ఇచ్చిన సలహాతో ఆమె వరుస ఆఫర్లు ఒప్పుకుంటునట్లుగా ప్రచారం జరుగుతోంది. కెరీర్ గాడి తప్పింది అని అర్థమైన వెంటనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన డాక్టర్ ప్రియుడుతో ఏడడుగులు వేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటుందని చెబుతున్నారు.

పెళ్లితో సెటిల్ అవుతుందా: నిజానికి సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత దానిలో నుంచి అంత ఈజీగా బయటపడలేరు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ క్రేజ్ అలాగే ఫేమ్ వదులుకొని సాధారణ జీవితాన్ని గడిపేందుకు ప్రశాంతమైన వైవాహిక జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈ భామ ఆ వైవాహిక జీవితానికి అలవాటు పడుతుందో లేక మళ్లీ సినిమాల వైపు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X