42ఏళ్ల వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరోయిన్ తల్లి... త్వరలో ఆ వ్యక్తితోనే!
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు విడిపోయి రెండో పెళ్లి చేసుకోవడం పరిపాటిగా జరుగుతున్న విషయమే. వాళ్లే కాదు.. హీరోయిన్, హీరోల తల్లులు, తండ్రులు సైతం రెండో పెళ్లి చేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తల్లి రెండో పెళ్లి చేసుకోబుతుందంటూ సినిమా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా గడుపుతుంది. అయితే ఈ క్రమంలో ఆమె తన తల్లికి రెండో పెళ్లి చేయాలని సిద్ధం అయిందట. ఆ వివరాల్లోకి వెళితే...
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రేటీలు ప్రేమ వివాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో.. ముణ్ణాళ్ల ముచ్చటగానే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. చాలా మంది సెలబ్రెటీలు... తమ తల్లి, తండ్రి ఒంటరిగా ఉండటం చూడలేక రెండో పెళ్లి చేయడానికి సిద్ధం అవుతున్నారు. పిల్లలే దగ్గరుండి పేరెంట్స్ పెళ్లి చేస్తున్నారు.

ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య చనిపోయాక ఆయన రెండో పెళ్లి దగ్గరుండి ఆమె కూతురు జరిపించింది. భార్య చనిపోయాక దిల్ రాజు.. కాస్త డల్ అయ్యారు. తండ్రిని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక.. పిల్లలే దగ్గరుండి పెళ్లి చేశారు. ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు... ఇటీవల ఓ కుమారుడికి జన్మనిచ్చారు.
ఇక మెగా మేనళ్ళుల్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా తమ తల్లికి రెండో పెళ్లి చేశారు. వీళ్లే కాకుండా సింగర్ కౌసల్య కు కూడా తన కొడుకు పెళ్లి చేస్తానని అంటున్నాడని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే వీరిలాగే మన టాలీవుడ్ లో ఉండే ఓ యంగ్ హీరోయిన్ కూడా తల్లికి పెళ్లి చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆ నటి... తన తల్లికి రెండో పెళ్లి చేయాలని చూస్తుందని సమాచారం.

యంగ్ హీరోయిన్ వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇక తన పేరంట్స్ చిన్నప్పుడే విడిపోయారు. విడాకులు తీసుకుని సపరేట్ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆ హీరోయిన్ తన తల్లికి రెండో పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచించిందట. ఇక ఆ హీరోయిన్ మదర్ కూడా... ఓ వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే వారి మధ్య రిలేషన్ వేరే అయినప్పటికీ ఈ హీరోయిన్ మాత్రం వారిద్దరి జోడి బాగుందని ఆలోచించింది.

తన తల్లికి ఆ వ్యక్తితో పెళ్లి చేయాలని... ఒక మంచి జోడి దొరుకుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుందట ఈ యంగ్ బ్యూటి. ఇక ఇదే విషయాన్ని మొదట తన తల్లికి చెబితే కాస్త కోపంగా మాట్లాడిందని తెలుస్తోంది. కానీ ఆ తర్వాత నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా చేస్తున్నాను అమ్మ అని అనడంతో ఆ హీరోయిన్ మదర్ కూడా ఏమీ అనలేక ఓకే చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.


Click it and Unblock the Notifications











