గుదిబండగా మారిన స్టార్ హీరోయిన్.. ఆ కండిషన్ దెబ్బకు హడల్.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు!
సాధారణంగా తెలుగు సినిమాల్లో ఇతర భాషలకు చెందిన వారినే హీరోయిన్లుగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. వారైతే గ్లామర్ సీన్లకు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తారని ఎలాంటి తలనొప్పి లేకుండా ఫ్రీ వాతావరణంలో సినిమా షూటింగ్ జరుగుతుంది అని ఎక్కువగా పరభాషా నటీమణుల్లో మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా ఒక పరభాషా నటీమణి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. ఆమె ఇప్పుడు నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసలు ఆమె ఏం చేస్తోంది? నిర్మాతలు ఎందుకు తలనొప్పిగా మారింది? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వెంటనే అవకాశాలు
తెలుగు సినీ పరిశ్రమలో మొదటి సినిమా హిట్ అందుకున్న భామలకు వెంటనే అవకాశాలు దొరుకుతుంటాయి. ఇక రెండు, మూడు సినిమాలు కూడా ఆమెకు వరుస హిట్లు పడ్డాయంటే ఇక ఆమెను ఆపే వారే ఉండరు. గోల్డెన్ లెగ్ అనే పేరు పడటంతో పాటు వారు సినీ అవకాశాలు వచ్చి పడుతూ ఉంటాయి. దీంతో రెమ్యూనరేషన్ లో పెంచడమే కాక తమను తాము ప్రూవ్ చేసుకోవాలని అనే తాపత్రయం కూడా ఆయా హీరోయిన్లలో పెరుగుతూ ఉంటుంది.

ఆనంద పడతారు కానీ
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న ఒక భామ ఈ మధ్య తాను మహానటిని అని పిలిపించుకోవాలని ప్రయత్నం చేస్తోందట. అందుకే తెలుగు మీద పెద్దగా పట్టు లేకపోయినప్పటికీ తాను నటిస్తున్న అన్ని సినిమాల్లో ఇకమీదట తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే మామూలుగా ఇలా హీరోయిన్లు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాను అంటే నిర్మాతలు ఆనంద పడతారు కానీ ఈ భామ విషయంలో మాత్రం బాధపడుతున్నారు.

నాలుగైదు రోజులు
ఎందుకంటే సదరు భామకి వరుస హిట్ సినిమాలు ఉన్నాయి, మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కానీ నటనలో ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన తట్టుకోవడం కష్టమే అని అంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. అదీకాక వచ్చీ రాని తెలుగులో డబ్బింగ్ పూర్తి చేయాలి అంటే దాదాపు నాలుగైదు రోజులు తక్కువలో తక్కువ పడుతుందని అంటున్నారు. అదే ఇప్పుడు నిర్మాతలకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది.

బెటాలియన్ లాగా టీమ్
ఎందుకంటే ఆమె షూటింగుకు కానీ డబ్బింగు కానీ ఒక్కతే రాదట. ఆమె వెంట ఒక బెటాలియన్ లాగా టీమ్ ఉంటుందని, వారందరినీ కూడా నిర్మాతలే మెయింటెన్ చేస్తూ ఉండాలని తెలుస్తోంది. ఆమె సహా ఆమె టీం మొత్తానికి విమాన టికెట్లు, వాళ్లందరికీ ఫైవ్ స్టార్ హోటల్లో స్టే, వాళ్లందరికీ దేశవిదేశాల ఆహారపదార్ధాలు పైపెచ్చు ఆమె అసిస్టెంట్లకు, టీంకి చెల్లించాల్సిన డబ్బులు కనుక లెక్క వేస్తే నిర్మాతలకు ఈజీగా రోజుకు రెండు నుంచి మూడు లక్షలు పైగానే ఖర్చు అవుతున్నాయట.

నిర్మాతలను ఇబ్బంది పెట్టిందట
అదే 2,3 లక్షల రూపాయలు ఇస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి సినిమా మొత్తానికి డబ్బింగ్ చెప్పేసి వెళ్లిపోతారని, కానీ హీరోయిన్ డబ్బింగ్ చెప్పాలని ఆశ ఇప్పుడు నిర్మాతలకు గుదిబండగా మారిందని అంటున్నారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు మైనస్ చేస్తుందేమో అనే భయంతో కూడా నిర్మాతలు ఉన్నారట.. అయితే ఆమెకు నేరుగా ఈ విషయాన్ని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారట. దానికి తోడు ఈ మధ్య కంపల్సరీ డబ్బింగ్ చెప్పే సినిమాలే చేస్తానని ఆమె కండిషన్లు పెట్టడంతో కొంతమంది నిర్మాతలు ఆమెను డబ్బింగ్ చెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య ఒక సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పించకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారని సినిమా ప్రమోషన్ కి కూడా రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టిందట. మొత్తం మీద ఈ భామ వ్యవహారం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











