twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన స్టార్ హీరోలకే కాదు మన స్టార్ డైరెక్టర్స్ కి ఒక్కో సెంటిమెంట్...

    By Sindhu
    |

    ఇండస్ట్రీలో సెంటిమెంట్లపై ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. సెంటిమెంట్‌ సూత్రం పాత సినిమాల కాలం నుండి ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే హీరోలకుండే సెంటిమెంటుకు తోడు కొందరు నిర్మాత, దర్శకులకు కూడా సెంటిమెంట్‌ విషయంలో గట్టి నమ్మాకాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటి తరం టాలీవుడ్‌ హీరోల సెంటిమెంట్లు ఒక్కసారి పరిశీలిస్తే...నందమూరి నట సింహం, యువరత్న బాలకృష్ణకు తన టైటిల్‌ లో సింహం ఉన్నట్లయితే సినిమా సూపర్‌ హిట్‌ అని ఇప్పటికే విడుదలైన చిత్రాలు నిరూపించాయి. లేటెస్ట్‌ గా వచ్చిన 'సింహా" చిత్రమే ఇందుకు ఉదాహరణ. ఇక వెంకటేష్‌ కుటుంబ తరహా కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన చిత్రాలు ఆడవారి టైటిల్స్‌ తో ఆడేస్తుంటాయి. ఇటీవల ఆ సెంటిమెంట్‌ బలంగా ఉండటంతో లేటెస్ట్‌ గా విడుదలయ్యే 'నాగవల్లి" చిత్రం మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. 'లక్ష్మి, 'తులసి", చిత్రాలు హిట్‌ రేంజ్‌ ఇమేజ్‌ ను సాధించిపెట్టాయి. అందుకే వెంకటేష్‌ రాబోయే తన చిత్రాల టైటిల్స్‌ కూడా ఆడవారి పేర్లు వచ్చేలా చూసుకోవడం విశేషం. యువసామ్రాట్‌ నాగార్జునకు డిసెంబర్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందని ఆయన అభిమానుల నమ్మకం. అందుకే తన అభిమానుల కోసం డిసెంబర్‌ నెలలో తన లేటెస్ట్‌ చిత్రం 'రగడ" చిత్రం విడుదల చేయనున్నారు. గతంలో వచ్చిన 'మాస్‌", 'కింగ్‌" సినిమాలు డిసెంబర్‌లోనే విడుదలవడం విశేషం.

    ఇక ప్రిన్స్‌ మహేష్‌బాబు తన చిత్రాలు మూడు అక్షరాలతో వచ్చేవాటికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆయన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలన్నీ కూడా మూడు అక్షరాలతో విజయం సాధించినవే. 'మురారి", 'అతడు", 'పోకిరి", లేటెస్ట్‌ గా విడుదలైన 'ఖలేజా" ఇవన్నీ మహేష్‌బాబు మూడక్షరాల సెంటిమెంట్‌ కు ఉదాహరణలే. నందమూరి యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కు తొమ్మిది సెంటిమెంట్‌ ఎక్కువ. తాను ఏం పని చేసినా తొమ్మిది నంబర్‌ వచ్చేలా చూసుకుంటారట. గోపీచంద్‌ సినిమాలు చివర్లో సున్నాతో పూర్తయితే ఆ చిత్రం తప్పక విజయం అని గతంలో కొన్ని చిత్రాలు నిరూపించాయి. 'యజ్ఞం", 'రణం", 'శంఖం"లాంటి చిత్రాలు సూపర్‌ హిట్‌ ను సాధించాయి. దర్శకులలో కూడా ఈ సెంటిమెంట్‌ బాగానే ఉంది. కోడిరామకృష్ణ తన చిత్రం షూటింగ్‌ జరుగు తున్నంతసేపూ తలకు బ్యాండ్‌ క్లాత్‌ కట్టుకుంటారు. సెన్సేషనల్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినిమా పూర్తయ్యేదాకా గడ్డం పెంచుతారు. అలాగే కె.విశ్వనాథ్‌ తన సినిమా పేర్లన్నింటినీ స,శ అక్షరాలతో ప్రారంభం అయ్యేలా చూసుకుంటారు. మణిరత్నం సినిమాలో ఓ వర్షం పాటో...సన్నివేశమో ఉండితీరాలి. నిర్మాతలలో రామానాయుడు తన ప్రతి సినిమాను విజయవాడ దుర్గగుడిలో పూజచేయించడం ఆనవాయితీ. నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి తాను తీసే సినిమాలన్నీ 'అ" అక్షరంతో మొదలయ్యేలా, భార్గవ్‌ ఆర్ట్‌‌ బ్యానర్‌ కింద వచ్చే సినిమా పేర్లన్నీ 'మ" అక్షరంతోనే ఎక్కువగా విజయవంతం కావడం గమనార్హం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X